తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రాఫర్‌లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతను డిస్కో డాన్సర్‌ని చూసి డ్యాన్సర్‌గా మారాలని అనుకున్నారు. కానీ డ్యాన్స్ ఎవరు నేర్పుతారు..? ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే వైవిధ్యమైన పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు.
ఆ తర్వాత తిరుపతికి వెళ్లి అక్కడ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. కేవలం రూ. 5 ఫీజుతో చాలా మంది విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అందుకోసం మద్రాసు వెళ్లిపోయారు. తన టాలెంట్‌కి అక్కడ విలువ లేదని మళ్లీ తిరుపతికి వచ్చి ఇన్‌స్టిట్యూట్‌ను నడిపారు.
(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత)
రాకేష్ మాస్టర్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే..
ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము ఏంటో చూపించాలని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు రాకేష్ మాస్టర్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయం అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే.
శేఖర్ మాస్టర్‌తో విబేదాలు
టాలీవుడ్‌లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ కూడా ఆయన శిష్యుడే.. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్ పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఒకరోజు ఫేస్‌బుక్ లైవ్ చాట్లో రాకేష్ మాస్టర్‌తో మీ గొడవ ఏమిటి? అని ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. తనపై మాస్టర్‌కు ఉన్న కోపానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మాటల చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపాడు.
గొడవకు కారణం ఇప్పటికీ సస్పెన్సే
రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ శేఖర్‌తో గొడవకు గల కారణాలను తెలపకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య ఏం జరిగింది? అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవారు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్‌పై ఫైర్ అయ్యేవారు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది.
(ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?)
Comments
Please login to add a commentAdd a comment