రాకేశ్ మాస్టర్ తెలుగు హీరోలకు డ్యాన్స్ నేర్పించాడు, డ్యాన్స్‌లో స్టైల్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. వెండితెరపై ఎన్నో హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాడు. టాప్ కొరియోగ్రాఫర్‌గా వెలుగు వెలిగిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్ జూన్ 18న మరణించాడు. ఆయనకు గుర్తుగా విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేశ్ మాస్టర్‌కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.
ఓ డ్యాన్స్ షోలో వైష్ణవుడి వేషధారణలో బీభత్సమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు రాకేశ్ మాస్టర్. ఇది చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేశ్ మాస్టర్ గెటప్ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. ఎవరి దగ్గరా సాయం కోసం చేతులు చాచకుండా సొంత డబ్బుతోనే దీన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్ మాస్టర్ శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రాకేశ్ మాస్టర్ విగ్రహం ఎలా ఉందో వీడియో రిలీజ్ చేశాడు. విగ్రహం ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియజేయండని కోరాడు.
అయితే చాలామందికి ఈ విగ్రహం నచ్చినట్లు లేదు. ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహంలా లేదు, పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది, మీకు ఏ ఫోటో దొరకలేదా భయ్యా? అస్సలు మ్యాచ్ కాలేదు అని కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఒకరైతే.. వీడు దేనికి పనికిరాని వెధవ అని కామెంట్ చేయగా బషీర్ అందుకు సేమ్ టు యూ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విగ్రహం పూర్తిగా తయారవడానికి మరో నెల రోజులు పడుతుందని మరో వీడియోలో వెల్లడించాడు బషీర్. పూర్తిగా సిద్ధమైన తర్వాతైనా అందరికీ నచ్చుతుందో, లేదో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment