
ప‍్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో జూన్ 18న ఆదివారం ఆకస్మాత్తుగా మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి సాయంగా నిలిచిన డ్యాన్స్ మాస్టర్ మృతిని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
(ఇది చదవండి: Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్)
టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అలాంటి మాస్టర్‌కు తోటి కొరియోగ్రాఫర్స్ ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇవాళ హైదరాబాద్‌లోని బోరబండలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషాద సమయంలో ఆయనతో పనిచేసిన కొరియోగ్రాఫర్స్, స్టూడెంట్స్ సగర్వంగా తుది వీడ్కోలు పలికారు. సత్య, బషీర్ మాస్టర్‌తో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ చేస్తూ సాగనంపారు. రాకేశ్ మాస్టర్ అంత్యక్రియల్లో భారీగా అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.
(ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment