Sekhar Master Gets Emotional Over Rakesh Master Death, Deets Inside - Sakshi
Sakshi News home page

Rakesh Master Death: రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత.. చివరి చూపు చూసేందుకు వచ్చిన శేఖర్‌ మాస్టర్‌

Published Mon, Jun 19 2023 12:55 PM | Last Updated on Mon, Jun 19 2023 1:42 PM

Sekhar Master Gets Emotional over Rakesh Master Death - Sakshi

వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ ఆదివారం (జూన్‌ 18న) కన్నుమూశారు. రక్త విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీవీ చూసుకుంటూ డ్యాన్స్‌ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్‌ మాస్టర్‌. టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే!

ఎందుకో తెలియదు కానీ శేఖర్‌ మాస్టర్‌, రాకేశ్‌ మాస్టర్‌ల మధ్య దూరం పెరిగింది. గురుశిష్యుల బంధం చెదిరిపోయింది. శేఖర్‌ మాస్టర్‌ పేరెత్తితే చాలు నిప్పులు చెరిగేవారు రాకేశ్‌. అటు శేఖర్‌ మాత్రం.. ఆయన ఎప్పటికీ తన గురువే అని చెప్తూ ఉండేవారు. ఈ క్రమంలో శేఖర్‌ మాస్టర్‌ తన గురువును చివరి చూపు చూసేందుకు వచ్చారు. దీనవదనంతో అక్కడికి చేరుకున్న శేఖర్‌ మాస్టర్‌ తన గురువును నిర్జీవంగా చూసి కంటతడి పెట్టుకున్నారు. జానీ మాస్టర్‌ సైతం రాకేశ్‌ మాస్టర్‌ భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: రాకేశ్‌ మాస్టర్‌ కుటుంబం గొప్ప నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement