Shekhar master
-
శేఖర్, సందీప్ మాస్టర్ సంపాదన ఎంతో తెలుసా? ఒక్క సంగీత్‌కు..
ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నవాళ్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. రాకేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న ఇతడు తర్వాతి కాలంలో గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో పెద్ద హీరోలతో స్టెప్పులేయిస్తూ టాప్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. రాకేశ్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా చేరి డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకున్న మరో వ్యక్తి బషీర్ మాస్టర్. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ అందుకునే పారితోషికాన్ని బయటపెట్టాడు. బషీర్ మాస్టర్ నేను లక్ష తీసుకుంటా బషీర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'సంగీత్ వేడుకల కోసం నేను ఐదు రోజులపాటు కొరియోగ్రఫీ చేసి రూ.1 లక్ష తీసుకుంటాను. అదే అమెరికా వాళ్లకు ఆన్లైన్లో ఒక్క పాటకు డ్యాన్స్ నేర్పించినందుకుగానూ రూ.30 వేలు తీసుకుంటాను. నా పార్ట్‌టైమ్ సంపాదన ఇదే! ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లందరూ ఇలా సంగీత్ వేడుకలు చేసినవారే! సందీప్ కూడా.. శేఖర్ మాస్టర్ ఒక్క సంగీత్ కోసం రూ.40 లక్షలు తీసుకుంటాడు. జానీ మాస్టర్, సత్య మాస్టర్, సందీప్ అందరూ సంగీత్‌లలో చేసినవారే! మొన్నటివరకు సందీప్ కూడా రూ.2-3 లక్షలకు సంగీత్ చేశాడు. నాక్కూడా మంచి రేంజ్ వచ్చినప్పుడు రూ.50 లక్షలు తీసుకుంటాను. బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఛాన్స్ వస్తే వెళ్తానేమో, అంతా ఆ దేవుడి చేతిలో ఉంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: డిసెంబర్లో నటుడి మరణం.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని ఫ్యామిలీ! -
శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను: శ్రీలీల
నటి శ్రీలీల అంటే సినీ ప్రియులకు టక్కున గుర్తుకువచ్చేది ఆమె డ్యాన్స్. పాట ఏదైనా సరే హీరోకి ఏమాత్రం తగ్గకుండా.. కొన్నిసార్లు హీరోలను మించి డ్యాన్స్ చేస్తారీ బ్యూటీ. మాస్ మహారాజ్ రవితేజ సినిమా అయిన ధమాకాలో ఈ బ్యూటీ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఆ సినిమాలో వీరిద్దరూ కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ స్కంద సినిమాతో సెప్టంబర్ 15న రామ్ సరసన మళ్లీ రచ్చ చేయబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను శ్రీలీల షేర్ చేసుకుంది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో నన్నూ అలాంటి కోరికే కోరారు: ఇమ్మానుయేల్) తాను చిన్నప్పటి అమ్మ ఒత్తిడి వల్లే భరత నాట్యం నేర్చుకున్నానని శ్రీలీల తెలిపింది. అలా చిన్నతనం నుంచే చదువుతో పాటు డ్యాన్స్ కూడా తనకు ఒక భాగం అయిపోయిందని చెప్పింది. అలా తన స్కూల్లో కూడా ఏదైనా ప్రొగ్రామ్ ఉంటే మొదట తన డ్యాన్స్ ఉండేదని చెప్పుకొచ్చింది. అలా ఒక్కోసారి డ్యాన్స్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో కాళ్లకు బొబ్బలు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. అప్పుడు డ్యాన్స్ అపేస్తానని తన అమ్మతో చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. డ్యాన్స్ నేర్చుకోమనే ప్రోత్సహించేదని తెలిపింది. ఆ తరువాత తనకే డ్యాన్స్ మీద మక్కువ పెరిగిందని చెప్పింది. సినిమా ఎంట్రీ ఎలా జరిగిందంటే శ్రీలీల అమ్మగారు స్వర్ణలత బెంగళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా కొనసాగుతున్నారని తెలిసిందే. సినిమాల్లోకి ఎంట్రీ ఎలా జరిగిందో శ్రీలీల ఇలా షేర్ చేసింది. ' అమ్మ డాక్టర్ కావడంతో నాకు స్కూల్లో సెలవులు వస్తే నన్ను కూడా మెడికల్ కాన్ఫరెన్సులకు తీసుకెళ్తూ ఉండేది. ఈ కారణం వల్ల నాకు కూడా వైద్య వృత్తి మీద చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. నా ప్రతి పుట్టినరోజు నాడు ఫోటో షూట్ చేయించడం అమ్మకు ఇష్టం.. అలా ఓ సారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భువన గౌడతో ఫోటో షూట్‌ను అమ్మ చేయించింది. ఫోటోలను ఆయన ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో వాటిని చూసిన కన్నడ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చాడు. అలా స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి రావడం జరిగిపోయింది.' శ్రీలీల తెలిపింది. ఆ తర్వాత తనకు డాక్టర్ కావలనే కోరిక చిన్నతనం నుంచే ఉండటంతో చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదని చెప్పింది. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విషయం తెలిసిందే. శేఖర్ మాస్టర్‌కు సారీ ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం వల్ల చాల బాధపడినట్లు శ్రీలీల చెప్పింది. తనకు ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం ఏ మాత్రం నచ్చదని తెలిపింది. షూటింగ్లో ఎక్కువ రీటేక్స్ తీసుకుంటే సమయంతో పాటు నిర్మాతకు కూడా ఖర్చు పెరుగుతుందని ఇది ఏ మాత్రం అంత మంచిది కాదని ఆమె తెలిపింది. అలా ఓ సారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ముప్పై టేకులు తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. ఆ పాట కోసం ఎన్ని సార్లు రిహార్సల్స్ చేసినా కూడా ఓకే కాలేదని తెలిపింది. అలా ముప్పై సార్లు రీటేక్స్ తీసుకోవడం చాలా బాధ అనిపించిందని చెప్పింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి సారీ చెబుతూ మూడు పేజీల లేఖను శేఖర్ మాస్టర్‌కు రాసిందట. అందుకు ఆయన కూడా తనకు ఫోన్ చేసి ఇందులో నీ తప్పేంలేదు.. ఈ పాటలో ఎక్కువ మంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారు బ్యాక్ గ్రౌండ్లో కరెక్ట్ స్టెప్లు వేయడం లేదని చెప్పాడట. అందుకే ఇన్ని రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని శేఖర్ మాస్టర్ చెప్పడంతో కొంచెం సంతృప్తి అనిపించిందట. కేజీయఫ్ ఫేమ్ యశ్ని ఏమని పిలుస్తుందంటే.. శ్రీలీల కుటుంబంతో కేజీయఫ్ ఫేమ్ యశ్‌కు మంచి పరిచయాలే ఉన్నాయని తెలిసిందే. శ్రీలీల అమ్మగారు గైనకాలజిస్ట్ కావడంతో యశ్ భార్య రాధికకు రెండుసార్లు ఆమె డెలివరీ చేసింది. దీంతో వారికి మంచి పరిచయాలు ఏర్పాడ్డాయి.రాధిక డెలివరి సమయంలో ఎక్కువగా ఆస్పత్రిలో శ్రీలీలే ఉండేవారట. అలా రాధికను అక్కా అని శ్రీలీల పిలుస్తుందట. అంతేకాకుండా యశ్‌ను జీజూ (బావా) అని పిలుస్తుందట. అలా తనకు కన్నడ సినిమాలో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు. -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18న) కన్నుమూశారు. రక్త విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే! ఎందుకో తెలియదు కానీ శేఖర్ మాస్టర్, రాకేశ్ మాస్టర్ల మధ్య దూరం పెరిగింది. గురుశిష్యుల బంధం చెదిరిపోయింది. శేఖర్ మాస్టర్ పేరెత్తితే చాలు నిప్పులు చెరిగేవారు రాకేశ్. అటు శేఖర్ మాత్రం.. ఆయన ఎప్పటికీ తన గురువే అని చెప్తూ ఉండేవారు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తన గురువును చివరి చూపు చూసేందుకు వచ్చారు. దీనవదనంతో అక్కడికి చేరుకున్న శేఖర్ మాస్టర్ తన గురువును నిర్జీవంగా చూసి కంటతడి పెట్టుకున్నారు. జానీ మాస్టర్ సైతం రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం -
చిరు, బాలయ్యలో ఉన్న కామన్ క్వాలిటీ అదే: శేఖర్ మాస్టర్
‘‘చిరంజీవి, బాలకృష్ణగార్లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే వారి అంకితభావం, సమయపాలన. ఏ డ్యాన్స్ మూమెంట్‌ని అయినా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేంతవరకూ రిలాక్స్ అవ్వరు’’ అన్నారు నృత్యదర్శకుడు వీజే శేఖర్. చిరంజీవీ టైటిల్ రోల్లో, రవితేజ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వరుసగా జనవరి 13, జనవరి 12న రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ‘వాల్తేరు వీరయ్య’లోని అన్ని పాటలకు, ‘వీరసింహారెడ్డి’లోని రెండు పాటలకు (సుగుణసుందరి, మా భావ మనోభావాల్) కొరియోగ్రఫీ చేశారు శేఖర్. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ– ‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ఒకేసారి సంక్రాంతి సమయంలోనే రిలీజ్ అవుతాయనుకోలేదు. కాబట్టి ఈ సినిమాల్లోని పాటలకు నృత్యరీతులు సమకూర్చేప్పుడు పెద్దగా ఆందోళనపడలేదు. కానీ ఇప్పుడు రెండు చిత్రాలూ సంక్రాంతికే వస్తుండటంతో ఒకవైపు ఆందోళనగా మరోవైపు సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి నాకు పెద్ద పండగ అని చెప్పగలను. ఇక సోషల్ మీడియాలో కొన్ని మూమెంట్స్ రీల్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఈ మూమెంట్స్ బాగుంటే వీటి తాలూకు పాటలను, కంటెంట్‌ను బట్టి సినిమాను ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. సో.. సిగ్నేచర్ స్టెప్స్ ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేలా అనిపిస్తోంది. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నేను సిగ్నేచర్ స్టెప్స్‌ను ఫాలో అవుతూ వస్తున్నాను. అలాగే సీనియర్లకు కొన్నిసార్లు మూమెంట్స్‌ని బట్టి రెండు, మూడు ఆప్షన్లు రెడీ చేసుకుంటుంటాం. ఇక దర్శకత్వ ఆలోచన ఉంది కానీ ఎప్పుడో కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం మహేశ్‌బాబు–త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్ సినిమా, రవితేజగారి ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. -
మోగాస్టార్తో మాస్ మహారాజా స్టెప్పులు!
వీరయ్యతో కలిసి మాస్ స్టెప్పులు వేశారు రవితేజ. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వాల్తేరు వీరయ్య పాత్రలో కనిపిస్తారు చిరంజీవి. ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్రలో పోలీసాఫీసర్‌గా రవితేజ నటించారని తెలిసింది. రీసెంట్గా ఓ భారీ సెట్లో చిరంజీవి, రవితేజలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించారు. ‘‘చిరంజీవి, రవితేజ అద్భుతమైన డ్యాన్సర్లు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ మెగా మాస్ సాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ఎం.ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం. -
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్ మాస్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ఇటీవల రిలీజైన ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్‌ను క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది. ఇక కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాటలో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్‌కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. కళావతి, పెన్నీ పాటలతో పాటు సర్కారువారి పాట నుంచి రాబోయే మాస్ సాంగ్ విశేషాలు ఇలా పంచుకున్నారు... ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ? సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా. సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ? మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ? ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. మహేశ్ గారితో మీ కాంబినేషన్ ? మహేశ్‌బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్. మహేశ్‌బాబు చాలా త్వరగా నేర్చుకుంటారు. మహేష్ బాబుగారిలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు. కళావతి పాటని అందరూ రీల్స్ చేశారు. మహేష్, సితార ల్లో ఎవరు బాగా చేశారు ? ఒక కోరియోగ్రఫర్ గా చెప్పండి? మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ వుంది. ఐతే పెన్నీ ప్రమోషనల్ సాంగ్ కొరియోగ్రఫీలో నేను లేను. మా అసిస్టెంట్స్ చేశారు. సినిమాలో వచ్చే పాటలో సితార పాప కనిపించదు. కాపీ స్టెప్పులు అని విమర్శలు వస్తుంటాయి కదా ? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? మనం ఒరిజినల్ గా చేస్తే మనది మనకే తెలిసిపోతుంది. మూమెంట్ కంపోజ్ చేస్తున్నపుడే కొత్తగా వుందా లేదా ? అనేది అర్ధమైపోతుంది. డ్యాన్స్ కాకుండా సాంగ్ లో కోరియోగ్రఫర్ ఇన్పుట్స్ ఎలా వుంటాయి ? ప్రాపర్టీస్ ని కూడా సజస్ట్ చేస్తారా ? కోరియోగ్రఫి అంటే డ్యాన్స్ మాత్రం కాదు.. సాంగ్ ని అందంగా ప్రజంట్ చేయాల్సిన బాధ్యత వుంటుంది. మూమెంట్స్ తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ కూడా కొన్నిసార్లు చెబుతాం. దర్శకులు కూడా సూచనలు చేస్తారు. కళావతి పాటని ఫారిన్ లో షూట్ చేశాం. బ్యాగ్ గ్రౌండ్ లో సితారలు వుంటే బావుంటుంది అనిపించింది. దర్శకుడు పరశురాం గారికి చెప్పా. ఆయన ఓకే అన్నారు. అప్పటికప్పుడు వేరే చోట నుంచి తెప్పించి షూట్ చేశాం. సాంగ్ లో బ్యుటిఫుల్ గా కనిపించాయి. మహేశ్ గారితో పని చేయడం ఎలా అనిపిస్తుంది ? మహేశ్ గారికి ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎన్ని మార్కులు వేస్తారు? మహేశ్‌బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. ''మాస్టర్ ఇంకోసారి చేద్దామా' అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేశ్‌బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా. మీ పిల్లల్ని కూడా ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నారా ? ఈ మధ్య డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ పాప ప్యాషన్ డిజైన్ అవుతానని అంటుంది. బాబు డాక్టర్ అంటున్నాడు. ఏం కావాలో ఛాయిస్ వాళ్ళకే ఇచ్చేశా. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి కదా ? ఇది కొరియోగ్రఫీలో కూడా వుంటుందా ? కొరియోగ్రఫీకి అలా ఏం వుండదు. ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నారు కానీ 'టాపు లేచిపోద్ది' పాటని ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. 'పుష్ప' మూమెంట్స్ కూడా పాన్ వరల్డ్ లో సందడి చేశాయి కదా. మూమెంట్ యునిక్ , క్యాచిగా వుంటే జనాల దృష్టిని ఆకట్టుకుంటుంది. టీమ్ ఇండియా క్రికెటర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మా మూమెంట్స్ రీల్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా వుంటుంది. ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ ని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా అంచనా వేశారు కదా ? ఆచార్య సాంగ్ ఎంత డిమాండ్ చేసిందో అంతా చేశాం. కథలో సందర్భాన్ని బట్టే కొరియోగ్రఫీ వుంటుంది. కొరియోగ్రాఫేర్ గా మీ డ్రీమ్ ఏమిటి ? చిరంజీవి గారికి, ప్రభు మాస్టర్ కి చేయాలని అనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యింది. రాజమౌళిగారితో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చేయాలని వుంది. మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు. ఆయన స్పాట్ లో చేసేస్తారు. మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు. మీ అంచనాలు తప్పిన పాట ? 'జైలవకుశ లో ట్రింగ్ ట్రింగ్ సాంగ్. చాలా కొత్తగా చేశాం. చాలా ఆదరణ పొందుతుందని భావించాం. కానీ అది అనుకున్నంత కనెక్ట్ కాలేదు. కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా ? లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ? చిరంజీవి గారు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాకా సినిమాలకి చేస్తున్నా. శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు. చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ ట్రోలింగ్ నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
SVP: మహేశ్ బాబు డాన్స్‌పై శేఖర్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sekhar Master About Mahesh Babu Mental Mass Step: ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కొరియోగ్రఫర్‌గా రాణిస్తున్నాడు శేఖర్ మాస్టర్. ప్రభుదేవ, లారెన్స్‌ల తర్వాత అంతగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం అగ్ర హీరోలతో మాస్, క్లాస్ స్టెప్పులు వేయిస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్‌పై తన మార్క్ తప్పసరిగా కనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ సరైనోడులో ‘బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టరే’, అలా వైకుంఠపురంలోని ‘రాములో రాములో’ పాటల సిగ్నెచర్ స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి జనంలోకి ఎంతగా దూసుకేళ్లాయో తెలిసిందే. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్ ఇప్పుడు తాజాగా నెటిజన్లు ఎక్కువగా ఫాలో అవుతున్న స్టెప్ కళావతి సాంగ్. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో స్టైలిష్‌గా, క్యూట్‌గా వేయించిన ఈ స్టెప్‌కు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దీంతో ఆ స్టెప్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక మార్క్ వేయించుకున్న శేఖర్ మాస్టర్ తాజాగా సాక్షితో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, కళావతి స్టెప్‌పై మహేశ్ బాబు రియాక్షన్ ఎంటన్నది ఆయన మాటల్లోనే వినండి! చదవండి: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ -
కళావతి పాటకు తమన్ స్టెప్పులు
-
కళావతి పాటకు తమన్ స్టెప్పులు.. నెటిజన్ల ప్రశంసలు
Thaman Dance To Kalavathi Song From Sarkaru Vaari Paata: మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మాస్ బీజీఎంలతో ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగిస్తాడు. ఇటీవల 'అఖండ' సినిమాకు ఇచ్చిన తమన్ బీజీఎం ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలోని బీజీఎంకి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే తమన్ మ్యూజిక్‌తోనే కాకుండా డ్యాన్స్‌తో సైతం మ్యాజిక్ చేశాడు. ప్రస్తుతం తమన్ సంగీతం అందించిన మరో సినిమా 'సర్కారు వారి పాట'. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ 'కళావతి సాంగ్' యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ లిరికల్ అత్యధిక వ్యూస్‌తో దుమ్ములేపుతోంది. దీంతో నెటిజన్లే కాకుండా కీర్తి సురేష్, మహేశ్ బాబు కుమార్తె సితార సైతం ఈ సాంగ్‌పై స్టెప్పులేసి అలరించారు. తాజాగా తనే కంపోజ్ చేసిన సాంగ్‌కు స్టెప్పులేసి అబ్బురపరిచాడు తమన్. శేఖర్ మాస్టర్‌తో కలిసి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఈ పాటలో మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్‌ను వేసిన తమన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తమన్ డ్యాన్స్ స్టెప్పులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
‘ఆ విషయంలో సాయి పల్లవికి పోటీ లేదు’
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందంచారు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘లవ్ స్టోరి’ చిత్రంలోని ఒక్కో పాట విడుదలవుతూ వస్తున్నాయి. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, ఆదివారం విడుదలైన ‘సారంగ దరియా’ పాట సూపర్ హిట్ అయ్యింది. విడుదలైన 24 గంటల్లో ఏకంగా 7 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఈ ఏడాది బన్ని రికార్డు బ్రేక్ చేస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతేడాది తివ్రిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంలోని ‘రాములో రాములా’ సాంగ్ అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డు సృష్టించిన సంగతి తెలుస్తోంది. ఈ ఏడాది సాయి పల్లవి ‘సారంగ దరియా’ ఈ రికార్డు బ్రేక్ చేస్తోందని భావిస్తున్నారు నెటిజనలు. సాంగ్ ఎంత బాగుందో.. ఇక సాయి పల్లవి డ్యాన్స్ కూడా అదే రేంజ్లో ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సారంగ దరియా సాంగ్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సాయి పల్లవి మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆమె డ్యాన్స్ చేస్తే.. నెమలి నాట్యం ఆడినట్లు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘సాయి పల్లవితో ఇది నా మూడో సాంగ్. గతంలో ఫిదా చిత్రంలో ‘వచ్చిండే’.. ఎంసీఏ చిత్రంలో ‘ఏవండోయ్ నాని గారు’ పాటలకు కొరియోగ్రఫి చేశాను. ఇప్పుడు లవ్‌స్టోరిలో ‘సారంగ దరియా’ పాటకు మరోసారి సాయిపల్లవితో పని చేసే అవకాశం లభించింది. ఇక మొదటి రెండు పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఈ పాటకు కొరియోగ్రఫి విషయంలో ఒత్తిడి, అంచానాలు అన్ని భారీగానే పెరిగాయి’’ అన్నారు. ‘‘సాయి పల్లవిని పెట్టుకుని బాగా చేయకపోతే తప్పు అవుతుంది. ఆమె ఏ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది. ఒకసారి పాట ఎడిట్ చేసి చూస్తే తనకంటే బాగా ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుంది. ఆమె క్లాసికల్ డాన్సర్. కొరియాగ్రఫర్స్ కొన్ని మూమెంట్స్ అనుకుంటారు. వాటిని హీరో, హీరోయిన్ కరెక్ట్‌గా చేస్తేనే బాగుంటుంది. సాయి పల్లవితో ఈ మూవ్మెంట్ రాదు అని ఎప్పుడూ అనుకోలేదు. మేము చెప్పిన మూవ్‌మెంట్స్‌ను ఇంకా బాగా చేసి చూపిస్తుంది. మాలాంటి డాన్స్ మాస్టర్లకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం’’ అన్నారు. ‘‘తను డ్యాన్స్ చూస్తే.. నెమలి నాట్యం ఆడినట్లే ఉంటుంది. స్టార్ హీరోలకు కూడా కష్టంగా భావించే స్టెప్స్‌ని తను చాలా చేస్తుంది. డ్యాన్స్ విషయంలో తనతో ఏ హీరోయిన్ పోటి పడలేరు అని తెలిపారు. ఈ చిత్రంలో తాను సారంగ దరియాతో పాటు మరో రెయిన్ పాటకు కొరియోగ్రఫి చేసినట్లు వెల్లడించారు శేఖర్ మాస్టర్. చదవండి: రానాతో సాయిపల్లవి కోలు.. కోలు... సాయి పల్లవి స్పెషల్ టాలెంట్ : అభిమానులు ఫిదా -
శేఖర్ మాస్టర్‌కు మహేశ్ బాబు బంపర్ ఆఫర్..
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకపోతోంది. అంతేకాకుండా కలెక్షన్న సునామీ సృష్టిస్తోంది. చిత్రం విడుదలైన ఈ మూడు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా పండగ సమయం ఉన్నందున మరిన్ని భారీ వసూళ్లు చేసే అవకాశం ఉంది. దీంతో మూవీ గ్రాండ్ సక్సెస్‌ను చిత్ర యూనిట్ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్ రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియోలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేశ్‌కు చదివి వినిపించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి మహేశ్ కూల్‌గా సమాధానమిచ్చాడు. దీనిలో భాగంగా చిత్ర విశేషాలను, విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాడో వివరించాడు. తదుపరి చిత్రంలో పోకిరి మహేశ్ అటిట్యూడ్ అండ్ ఇంటెన్స్ కావాలని ఓ అభిమాని కోరగా.. దానికి సమాధానంగా కచ్చితంగా భవిష్యత్‌లో గొప్ప చిత్రాలను చేద్దామని, పోకిరిని మించి చేద్దామని తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్‌లో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ బాగా చేశారని, ఇక నుంచి ప్రతీ సినిమాకు అతడినే కొరియోగ్రఫర్‌గా పెట్టుకోవాలని మరో ఫ్యాన్ సూచించాడు. తప్పకుండా తన చిత్రంలో కనీసం రెండు పాటలకు శేఖర్ మాస్టర్‌తో కలిసి పనిచేస్తామని మహేశ్ మాటిచ్చాడు. పూర్తి విశేషాల కోసం కింది వీడియోను చూడండి. చదవండి: సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ వందకోట్ల క్లబ్బులో సరిలేరు -
సైకలాజికల్ థ్రిల్లర్
అరుణ– కళ్యాణి టాకీస్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఒకడు’. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. అఖిల్‌రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ మాస్టర్ క్లాప్‌నివ్వగా, సత్య మాస్టర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను దర్శకుడు బీవీయస్ రవి దర్శకునికి అందించారు. ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ – ‘‘ఇది నా మొదటి చిత్రం. అందరూ అనుభవం ఉన్న టెక్నీషియన్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకులు మణిశర్మ గారు స్వరాలందించడం హ్యాపీ. మొత్తం ఐదు ఫెడ్యూల్స్లో సినిమా పూర్తి చేస్తాం ఈనెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమా మంచి మెసేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర నిర్మాత ముత్తయ్య అన్నారు.‘‘నేను చేస్తున్న మొదటి సినిమాకు మంచి స్క్రిప్ట్ కుదిరింది. మంచి సైకలాజికల్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు అఖిల్‌రెడ్డి. -
నృత్య రీతులు నేర్పించే.. కొరియోగ్రాఫర్
అప్‌కమింగ్ కెరీర్: మనిషి జీవితంలో ఒక భాగం.. నృత్యం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కాలు కదిపినవారే. మంచి సంగీతం వినిపించినప్పుడు తెలియకుండానే కాళ్లు, చేతులు ఆడిస్తాం. ఇది కూడా ఒకరకంగా నృత్యమే. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కెరీర్.. నాట్యాచార్యుడు(కొరియోగ్రాఫర్). నృత్యం నేర్పించేవారికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. డ్యాన్స్‌పై జనంలో అవగాహన పెరిగింది. దీన్ని ఒక కళగానే కాకుండా మానసిక, శారీరక సామర్థ్యాన్ని, ఆలోచనా శక్తిని పెంచే సాధనంగా చూస్తున్నారు. ఫిట్నెస్ సెంటర్లలోనూ డ్యాన్స్ ప్రవేశించింది. నగరాలు, పట్టణాల్లో ఎన్నో డ్యాన్స్ స్కూళ్లు వెలిశాయి. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్‌తోపాటు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకొనేందుకు పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లోనూ కూచిపూడి, కథక్, భరతనాట్యం వంటి భారతీయ సంప్రదాయ నృత్యాలకు మంచి ఆదరణ ఉంది. సినిమాలు, టీవీ సీరియళ్లు, అడ్వర్టైజ్మెంట్లు, రియాలిటీ టీవీ షోలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య రీతులను సమకూర్చే కొరియోగ్రాఫర్లకు భారీ డిమాండ్ ఉంది. పాఠశాలల్లో చిన్నారులకు నృత్యం నేర్పించేందుకు కొరియోగ్రాఫర్లను నియమిస్తున్నారు. డ్యాన్స్ ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయం ఆర్జించొచ్చు. నాట్యంలో కనీసం 15 ఏళ్లు సాధన చేసిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించాలని ఈ రంగంలోని ప్రముఖ కళాకారులు సూచిస్తున్నారు. నాట్యాచార్యుడిగా పేరు తెచ్చుకోవాలంటే ప్రతిరోజూ కఠోరమైన సాధన చేయాలి. ఇందుకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఇతరులను అనుకరించకుండా డ్యాన్స్‌లో తమదైన ముద్ర వేయాలంటే సృజనాత్మకత ప్రదర్శించాలి. కొత్త నృత్య రీతులను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తుండాలి. అర్హతలు: నృత్యం నేర్చుకోవడానికి ప్రత్యేకంగా విద్యార్హతలంటూ లేవు. డ్యాన్స్‌పై సహజమైన ఆసక్తి, అభిరుచి ఉన్నవారు ఇందులోకి ప్రవేశించొచ్చు. కొరియోగ్రఫీని ఫుల్‌టైమ్ ప్రొఫెషన్‌గా స్వీకరించాలనుకొనేవారు ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత డ్యాన్స్ స్కూల్లో చేరితే మంచిది. వేరే కోర్సులు చదువుతూ ఖాళీ సమయాల్లో పార్ట్‌టైమ్‌గా కూడా డ్యాన్స్ నేర్చుకోవచ్చు. వేతనాలు: కొరియోగ్రాఫర్లకు ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ఆకర్షణీయమైన ఆదాయం లభిస్తోంది. ఫ్రెషర్లకు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా వేతనం అందుతుంది. కొంత అనుభవం ఉన్న కొరియోగ్రాఫర్లు నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదించుకోవచ్చు. డ్యాన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు 1. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్: http://teluguuniversity.ac.in/ 2. వాసవి కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్-హైదరాబాద్ వెబ్సైట్: www.vcmdhyd.ac.in/ 3. కూచిపూడి ఆర్ట్ అకాడమీ వెబ్సైట్: www.kuchipudi.com/ 4. షియామక్ దావర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వెబ్సైట్: www.shiamak.com కొరియోగ్రఫీతో కెరీర్ గ్రోత్ ‘‘ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యాన్ని ఇచ్చేది డ్యాన్స్ ఒక్కటే. అందుకే కేజీ పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కొరియోగ్రఫీకి క్రేజ్ పెరుగుతోంది. సినిమాలు, టీవీ ఛానళ్లు, డ్యాన్స్ కాంపిటీషన్స దీనికి మరింత హోదాను తెచ్చిపెడుతున్నాయి. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఉన్నతంగా మలచుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. ఆసక్తికి క్రియేటివిటీ తోడైతే కెరీర్ గ్రోత్ సాధ్యం. మంచి వేతనాన్ని, సంతృప్తినిచ్చే కెరీర్.. కొరియోగ్రఫీ’’ - శేఖర్ మాస్టర్, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్