Sekhar Master About Mahesh Babu Mental Mass Step: ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రఫర్‌గా రాణిస్తున్నాడు శేఖర్ మాస్టర్. ప్రభుదేవ, లారెన్స్‌ల తర్వాత అంతగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం అగ్ర హీరోలతో మాస్, క్లాస్ స్టెప్పులు వేయిస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్‌పై తన మార్క్ తప్పసరిగా కనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ సరైనోడులో ‘బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టరే’, అలా వైకుంఠపురంలోని ‘రాములో రాములో’ పాటల సిగ్నెచర్ స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి జనంలోకి ఎంతగా దూసుకేళ్లాయో తెలిసిందే.
చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్
ఇప్పుడు తాజాగా నెటిజన్లు ఎక్కువగా ఫాలో అవుతున్న స్టెప్ కళావతి సాంగ్. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో స్టైలిష్‌గా, క్యూట్‌గా వేయించిన ఈ స్టెప్‌కు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దీంతో ఆ స్టెప్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక మార్క్ వేయించుకున్న శేఖర్ మాస్టర్ తాజాగా సాక్షితో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, కళావతి స్టెప్‌పై మహేశ్ బాబు రియాక్షన్ ఎంటన్నది ఆయన మాటల్లోనే వినండి!
చదవండి: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ
Comments
Please login to add a commentAdd a comment