వీరయ్యతో కలిసి మాస్ స్టెప్పులు వేశారు రవితేజ. చిరంజీవి టైటిల్ రోల్‌లో, రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వాల్తేరు వీరయ్య పాత్రలో కనిపిస్తారు చిరంజీవి. ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్రలో పోలీసాఫీసర్‌గా రవితేజ నటించారని తెలిసింది.
రీసెంట్‌గా ఓ భారీ సెట్‌లో చిరంజీవి, రవితేజలపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించారు. ‘‘చిరంజీవి, రవితేజ అద్భుతమైన డ్యాన్సర్లు. వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మెగా మాస్ సాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ఎం.ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్: కేవీవీ బాలసుబ్రహ్మణ్యం.
Comments
Please login to add a commentAdd a comment