Thaman Dance To Kalavathi Song From Sarkaru Vaari Paata: మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మాస్ బీజీఎంలతో ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగిస్తాడు. ఇటీవల 'అఖండ' సినిమాకు ఇచ్చిన తమన్ బీజీఎం ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలోని బీజీఎంకి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే తమన్ మ్యూజిక్‌తోనే కాకుండా డ్యాన్స్‌తో సైతం మ్యాజిక్ చేశాడు.
ప్రస్తుతం తమన్ సంగీతం అందించిన మరో సినిమా 'సర్కారు వారి పాట'. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ 'కళావతి సాంగ్' యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ లిరికల్ అత్యధిక వ్యూస్‌తో దుమ్ములేపుతోంది. దీంతో నెటిజన్లే కాకుండా కీర్తి సురేష్, మహేశ్ బాబు కుమార్తె సితార సైతం ఈ సాంగ్‌పై స్టెప్పులేసి అలరించారు.
తాజాగా తనే కంపోజ్ చేసిన సాంగ్‌కు స్టెప్పులేసి అబ్బురపరిచాడు తమన్. శేఖర్ మాస్టర్‌తో కలిసి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఈ పాటలో మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్‌ను వేసిన తమన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తమన్ డ్యాన్స్ స్టెప్పులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment