S Thaman
-
Varisu Movie: థియేటర్లో కాలర్ ఎగరేసిన దిల్ రాజు, ఏడ్చేసిన తమన్
-
థియేటర్లో కాలర్ ఎగరేసిన దిల్ రాజు, ఏడ్చేసిన తమన్
దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరిట రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. కానీ తమిళంలో మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న సమయానికి అంటే నేడే(జనవరి 11న) రిలీజైంది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందామని డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్.. చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు. అక్కడ అభిమానుల స్పందన చూసి ఎమోషనలైన థమన్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక దిల్ రాజు అయితే కాలర్ ఎగరేసి మరీ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హీరోయిన్ త్రిష సైతం తన ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూసినట్లు తెలుస్తుండగా రష్మిక కూడా వారిసు మూవీని ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే వారీసు తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.12 కోట్ల మేర డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. @MusicThaman Thaman Give His Soul For #Varisu ! 💯🥺❤️ His BGM & SONGs Is Another Level ! 🔥pic.twitter.com/BFI9deNjcp — SubashMV (@SubashMV5) January 11, 2023 చదవండి: కారు ప్రమాదం.. నటి బతకడం కష్టమన్న డాక్టర్స్ రామ్‌చరణ్ వీరసింహారెడ్డి చూస్తాడేమో: చిరంజీవి -
NBK108: నెవర్ బిఫోర్ పాత్రలో బాలయ్య
ఎఫ్ 3 హిట్‌తో జోరుమీదున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే నందమూరి బాలకృష్ణతో కలిసి మాస్ మూవీతో ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్లో NBK108 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా! సెంటిమెంట్, యాక్షన్‌ను సమపాళ్లలో మిక్స్ చేయనున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు పొందుపరుస్తూ ఓ వీడియో వదిలింది చిత్రయూనిట్. ఇదివరకెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను చూడబోతున్నారని చెప్పింది. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడని, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. Eternally Grateful & Super Thrilled to show our NATA SIMHAM #NandamuriBalakrishna garu in a never before role❤️🔥 Happy to be joining hands with the Musical Sensation, dear brother @MusicThaman ⚡️& @ShineScreens for this Exciting Endeavour #NBK108 @sahugarapati7 @harish_peddi pic.twitter.com/apAdRVLjD9 — Anil Ravipudi (@AnilRavipudi) August 11, 2022 చదవండి: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ -
తెలుగు సినిమాలకు అవార్డుల పంట
-
కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా అల వైకుంఠపురములో చిత్రానికి గానూ తమన్‌కు అవార్డు వరించింది. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకంగా ఐదు అవార్డులు వచ్చి పడ్డాయి. మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌గా మధ్యప్రదేశ్ నిలిచింది. బెస్ట్ క్రిటిక్ అవార్డు ప్రకటనను మాత్రం కేంద్రం వాయిదా వేసింది. ► మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్ ► ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): - తమన్ (అల వైకుంఠపురములో) ► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : జీవీ ప్రకాశ్ కుమార్ (సూరరై పోట్రు -తమిళ్) ► బెస్ట్ ఫీచర్ ఫిలిం: సూరరై పోట్రు ► బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియమ్ ► ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు) ► ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు - నాట్యం ► ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివరంజనీయం ఇన్నుమ్ శిల పెంగళమ్) ► ఉత్తమ సహాయ నటుడు: బిజు మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్- మలయాళం) ► ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు- తమిళ్) ► ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు) ► ఉత్తమ నటుడు (షేర్డ్): అజయ్ దేవ్‌గణ్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్- హిందీ) ► ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్ కేఆర్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ► ఉత్తమ పిల్లల చిత్రం: సుమి(మరాఠి) ► బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: నాంచమ్మ (అప్పయ్యప్పనుమ్ కోషియమ్- మలయాళం) ► బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: రాహుల్ దేశ్‌పాండే (మీ వసంతరావు - మరాఠీ) ► ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ (తమిళ్) ► ఉత్తమ మలయాళ చిత్రం: థింకలియా నిశ్చయమ్ ► ఉత్తమ కన్నడ చిత్రం: డొల్లు ► ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ► ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): అయ్యప్పనుమ్ కోషియమ్ (మలయాళం) ► ఉత్తమ లిరిక్స్: సైనా(హిందీ) - మనోజ్ ముంతషిర్ ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నచికెత్ బర్వె, మహేశ్ షెర్లా (తానాజీ: ది అన్సంగ్ వారియర్) ► ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీస్ నాడోడి (కప్పేలా -మలయాళం) ► ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ -తమిళ్) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): జాబిన్ జయన్ (డోలు- కన్నడ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అన్మూల్ భావే (మీ వసంతరావు- మరాఠీ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్: విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మలిక్- మలయాళం) ► బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్):షాలిని ఉషా నాయర్, సుధా కొంగర (సూరరై పోట్రు - తమిళ్) ► బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : మడోన్నా అశ్విన్ (మండేలా- తమిళ్) ► బెస్ట్ సినిమాటోగ్రఫీ: సుప్రతీమ్ భోల్ (అవిజాత్రిక్- బెంగాలీ) ► ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అనీష్ మంగేశ్ గోసావి (టక్ టక్- మరాఠీ), ఆకాంక్ష పింగ్లే, దివఏశ్ ఇందుల్కర్ (సుమీ- మరాఠీ) ► బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: తాలెడండ(కన్నడ) ► బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: ఫ్యునెరల్ (మరాఠి) ► బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: తానాజీ: ది అన్సంగ్ వారియర్ ► ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మడోన్న అశ్విన్ (మండేలా- తమిళ్) నాన్ ఫీచర్ ఫిలింస్ ► బెస్ట్ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్) ► బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ: మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ) ► బెస్ట్ ఎడిటింగ్: అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్) ► బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్- సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ) ► బెస్ట్ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం) ► ఉత్తమ డైరెక్షన్: ఆర్వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ) ► ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి) ► ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: కచీచినుతు (అస్సాం) ► స్పెషల్ జ్యూరీ అవార్డ్: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్) ► బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: ద సేవియర్: బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ) ► బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ) ► బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం ) ► బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: జస్టిస్ డిలేయ్డ్ బట్ డెలివర్డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ) ► బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మాన అరు మానుహ్ (అస్సామీస్) ► బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: సర్‌మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్) ► బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఆన్ ద బ్రింక్ సీజన్ 2- బ్యాట్స్ (ఇంగ్లీష్) ► బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: నాదదా నవనీతా ► బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం: పబుంగ్ శ్యామ్ ► బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: మందల్ కె బోల్ (హిందీ) ► బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: విశేష్ అయ్యర్ (పరాయా- మారాఠీ, హిందీ) చదవండి: కిస్, అత్యాచార సీన్లు మాత్రమే చేయమంటున్నారు: నటి -
మొదటిసారిగా భార్య, కొడుకు గురించి చెప్పిన తమన్..
Thaman About His Wife And Son Says Doing Stage Shows With Wife: టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తమన్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే సర్కారు వారి పాట మూవీతో సూపర్ హిట్ అందుకున్న తమన్.. ప్రస్తుతం గాడ్ ఫాదర్, రామ్‌చరణ్-15 చిత్రాలకు మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భార్య, కొడుకు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్లే బ్యాక్ సింగర్ అయిన శ్రీ వర్ధినిని తమన్ వివాహం చేసుకున్నాడు. ఆమె గతంలో మణిశర్మ, యువన్ శంకర్ రాజాతో పనిచేసింది. తమన్ డైరెక్షన్‌లోనూ నాలుగు పాటలు పాడింది. 'వర్ధిని వాయిస్ బాగుంటుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు అనిపిస్తే పాడిస్తారు. భవిష్యత్తులో ఆమెతో కలిసి స్టేజ్ షోలు చేయాలని ఉంది. అయితే దానికన్నా ముందు ఆమె రెండు మూడు సూపర్ హిట్ పాటలను పాడాలి.' అని తమన్ పేర్కొన్నాడు. ఇక తన కొడుకు గురించి చెబుతూ 'నా ట్యూన్లను మొదటగా విని అభిప్రాయం చెబుతాడు. మ్యూజిక్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటంలో అతడికీ మంచి పట్టు ఉంది. పియానోలో నాలుగో గ్రేడ్ పూర్తి చేశాడు. అతడు ఏ వృత్తి ఎంచుకుంటాడో నాకు తెలియదు.' అని తమన్ వెల్లడించాడు. చదవండి: మహేశ్ బాబుపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కళావతి పాటకు తమన్ స్టెప్పులు
-
కళావతి పాటకు తమన్ స్టెప్పులు.. నెటిజన్ల ప్రశంసలు
Thaman Dance To Kalavathi Song From Sarkaru Vaari Paata: మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మాస్ బీజీఎంలతో ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగిస్తాడు. ఇటీవల 'అఖండ' సినిమాకు ఇచ్చిన తమన్ బీజీఎం ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలోని బీజీఎంకి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే తమన్ మ్యూజిక్‌తోనే కాకుండా డ్యాన్స్‌తో సైతం మ్యాజిక్ చేశాడు. ప్రస్తుతం తమన్ సంగీతం అందించిన మరో సినిమా 'సర్కారు వారి పాట'. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ 'కళావతి సాంగ్' యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ లిరికల్ అత్యధిక వ్యూస్‌తో దుమ్ములేపుతోంది. దీంతో నెటిజన్లే కాకుండా కీర్తి సురేష్, మహేశ్ బాబు కుమార్తె సితార సైతం ఈ సాంగ్‌పై స్టెప్పులేసి అలరించారు. తాజాగా తనే కంపోజ్ చేసిన సాంగ్‌కు స్టెప్పులేసి అబ్బురపరిచాడు తమన్. శేఖర్ మాస్టర్‌తో కలిసి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఈ పాటలో మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్‌ను వేసిన తమన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తమన్ డ్యాన్స్ స్టెప్పులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
భీమ్లా నాయక్‌కు డీజే మిక్స్.. న్యూ ఇయిర్కు న్యూ వెర్షన్
Bheemla Nayak Song DJ Version Released On New Year: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది ఈ మూవీ కథ. అయితే ఇటీవలే ఈ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదల రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులందరూ ఆశించారు. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం విడుదల తేదిని వాయిదా వేసేందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకోగా పోస్ట్‌పోన్ అయింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పాటలు, గ్లింప్స్ సినిమా స్థాయిని మరింత పెంచేశాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులనందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా పవన్ కల్యాణ్ స్టార్డమ్కు తగ్గట్లుగా మ్యూజిక్ ఇరగదీస్తున్నాడు. సినిమాలోని లాలా భీమ్లా నాయక్ పాట ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ పాటకు తమన్ కొత్త వెర్షన్‌ను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే అలరిస్తోన్న ఈ పాటకు డీజే సాంగ్‌గా మలిచాడు. అయితే ఇటీవల కాలంలో వస్తున్న డీజే సాంగ్స్ సంగీత ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఈ డీజే సాంగ్స్ నెట్టింట కూడా రకరకాల రీల్స్, స్పూఫ్స్తో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ డీజే మిక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించవచ్చు. ఈ లాలా భీమ్లా నాయక్ సాంగ్ డీజే మిక్స్‌ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31న రాత్రి 7 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డిసెంబర్ 31కు స్పీకర్స్‌ను సిద్దం చేసుకోండి అని తమన్ ట్వీట్ చేశాడు. అంటే ఈ డీజే మిక్స్డ్ సాంగ్‌తో న్యూ ఇయర్ మోత మోగిపోనుందని తెలుస్తోంది. అయితే ఈ డీజే మిక్స్ పాట సినిమాలో ఉండకపోవచ్చు. #LalabheemlaDJ !! Get Ready Speakers 🎵 Time to get them kept serviced !! Let’s get #Lalafied ON 31st NIGHT !! #LalabheemlaDjVersion 🎹🥁 pic.twitter.com/nf34xhoYoT — thaman S (@MusicThaman) December 29, 2021 -
బన్నీ ఖాతాలో మరో రికార్డు.. వార్నర్ ప్రశంసలు
‘అల వైకుంఠపురములో’ సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా విజయంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ దుమ్ము దులిపాయి. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వల్ల బుట్టబొమ్మ సాంగ్ విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాది కావస్తున్పప్పటికి ఏదో ఒక రికార్డు సృష్టిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘బుట్టబొమ్మ’ మరో రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ పాటని ఇప్పటి వరకు 45 కోట్ల మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే అభిమానులు ‘బుట్టబొమ్మ’ హ్యాష్‌ట్యాగ్‌ని ఉదయం నుంచి ట్రెండ్ చేస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. అర్మన్ మాలిక్ పాడారు. గతంలో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సాంగ్ రికార్డు ఫిదా సినిమాలోని ‘వచ్చిండే’ పాట ఖాతాలో ఉండేది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ‘బుట్టబొమ్మ’ ఆక్రమించింది. (చదవండి: హిందీలోకి అల్లు అర్జున్ హిట్ సినిమా) ఇక బుట్ట బొమ్మ సాంగ్ 45 కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించడంతో పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. వీరిలో క్రికెటర్ డేవిడ్ వార్నర్, ‘అల వైకుంఠపురములో’కి మ్యూజిక్ అందించిన తమ్న్ వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలపుతున్నారు. తమన్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తెలుగులో సూపర్ హిట్టయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను ప్రస్తుతం వివిధ భాషల్లోకి రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ లుక్‌తో ఇప్పటికే అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. #UNSTOPPABLEAVPLALBUM #avpl Our #ButtaBomma HITS #450millionforbuttabomma My love to My dear brother @alluarjun My Respect to #Trivikram gaaru 🎵@ramjowrites @ArmaanMalik22@vamsi84 #radhakrishna gaaru #alluarvindh gaaru #pdprasad gaaru Team @haarikahassine @GeethaArts pic.twitter.com/4dmsqEzDZh — thaman S (@MusicThaman) November 24, 2020 -
అది నిజం : ఆయన లేకపోతే నేను లేను
నేడు ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తండ్రులతో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. మరోవైపు వరల్డ్ మ్యూజిక్ డే కావడంతో పలువురు సంగీత దర్శకులు కూడా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కొందరు అభిమానులు చేసిన ట్వీట్లపై స్పందించారు. తన గురువు మణిశర్మపై తన అభిమానాన్ని మరోసారి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. తమన్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ మణిశర్మపై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో మణిశర్మతో కలిసి వేదిక పంచుకున్న తమన్ కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యారు. తమన్ మాట్లాడుతూ.. ‘ఆయన ముందు ఉంటే మాటలు రావడం లేదు. దేశంలో ఆయన పనిచేయని మ్యూజిక్ డైరెక్టరే లేరు. అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు ఫేవరేట్ కీ బోర్డ్ ప్లేయర్ ఆయన. ఆయన సంగీత దర్శకుడిగా మారి యువ తరాలకు చాలెంజ్స్ ఇచ్చారు. ఎవర్గ్రీన్ మెలోడిలు అందజేశారు. ప్రపంచంలో నా పని మీద నమ్మకం ఉంది మా నాన్న గారికి. వీడు కచ్చితంగా మంచి డ్రమ్మర్ అవుతాడని. మీకు తెలుసు నేను చిన్నతనంలోనే మా నాన్నను కోల్పోయాను. నాన్న లేని లోటు తీర్చింది మణి గారు. తొమ్మిదేళ్లు నేను ఆయనతో వర్క్ చేశాను.. అప్పుడు ఆయన ఇచ్చిన అనుభవమే ఇప్పుడు నా వృత్తి. ఆయన లేకుండా నేను లేను. ఆయన పేరు నిలబెట్టడం నా బాధ్యత. నా హార్డ్ వర్క్‌ను ఆయనకు అంకితం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. దీనిపై తమన్ స్పందిస్తూ.. ‘ఇది నిజం.. ఆయన లేకుండా నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు’ అని పేర్కొన్నారు. అలాగే ఆ ట్వీట్‌ను రీట్వీట్ కూడా చేశారు. It’s true ♥️🤍 Without him i am not here today ♥️🔈🎹💿 https://t.co/AfILdeJQ2H — thaman S (@MusicThaman) June 21, 2020 -
బాలయ్య టీజర్ వచ్చేసింది.. రచ్చరచ్చే
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. బుధవారం బాలయ్య బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ చిన్న టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. అయితే అందరూ ఊహించినట్లు మూవీ టైటిల్‌ను చిత్రబృందం రివీల్ చేయలేదు. (‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?) 64 సెకన్ల నిడివి గల ఈ టీజర్లో నందమూరి అభిమానులకు కావాల్సిన పూర్తి విందు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెల్లటి దుస్తులు, గుబురు మీసాలతో మాస్ లుక్‌లో బాలయ్య కనిపించారు. ఆయన చెప్పిన ఫవర్ ఫుల్ డైలాగ్‌లు, శత్రుగణాన్ని గాల్లోకి ఎగిరేసి కొట్టడం వంటి సీన్లు టీజర్లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ సినిమా కోసం బాలయ్య భారీగానే బరువు తగ్గినట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. (బాలయ్య కోసం భారీగా శత్రు గణం) -
మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి కృష్ణ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు ఈ శుభవార్త తెలిపారు. ఆదివారం ఉదయం 9.09గంటలకు తన సినిమా టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. లీకువీరులు పేర్కొన్నట్టుగానే ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గీతా గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్ నిర్మించబోతోంది. జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఈ చిత్రంలో భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. (మహేశ్ ఫ్యాన్స్‌కు ఈ రోజు ట్రిపుల్ ధమాకా) ఇక ఈ టైటిల్ పోస్టర్లో మహేశ్ ఫుల్ లుక్ చూపించలేదు. వెనక నుంచి సూర్యుడి కాంతి, కాస్త రఫ్ లుక్, చెవికి రింగు, మెడపై రూపాయి కాయిన్ టాటూ ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి రేకిస్తోంది. ప్రస్తుతం టైటిల్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. గోపీసుందర్ మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తారని వార్తలు వచ్చిన్నప్పటికీ అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఫామ్‌లో ఉన్న తమన్వైపు చిత్ర బృందం మొగ్గు చూపింది. అంతేకాకుండా సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్ వినోద్ పనిచేయనున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్ త్రిపాత్రాభినయం పోషించనున్నారనే వార్తలపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. ఇక టైటిల్ ప్రకటించిన వెంటనే ‘సర్కారు వారి పాట’(#sarkaruvaaripaata) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతోంది. Here it is!!! #SarkaruVaariPaata💥💥💥 Blockbuster start for another hattrick💥💥💥@ParasuramPetla @GMBents @MythriOfficial @14ReelsPlus @MusicThaman pic.twitter.com/5JOCnPXjpC — Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2020 -
‘రాములో రాములా’.. మరో రికార్డు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అల..వైకుంఠపురుములో’. సంక్రాంతి కానుగా వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలసిందే. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా మ్యూజికల్‌గా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ ఆణిముత్యంగా నిలిచింది. ‘సామజవరగమనా’ సోషల్ మీడియాలో ఎంతటి ట్రెండ్ సృష్టించిందో చిత్రంలోని ప్రతీపాట యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘రాములో రాములా’ పాట మరో రికార్డును అందుకుంది. యూత్‌ను ఉర్రూతలూగించిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత వన్నె తెచ్చింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. సుశాంత్, నివేదా పేతురాజు, మరళీ శర్మ, టబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించింది. 100 Million+ Views for #RamulooRamulaa Full Video Song 🤩 ► https://t.co/YcVsDat7d6 #AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @anuragkulkarni_ @LyricsShyam #Mangli #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @haarikahassine @adityamusic pic.twitter.com/sfqNERoUPv — Geetha Arts (@GeethaArts) May 12, 2020 చదవండి: ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’ ముంబై కాదు... హైదరాబాద్‌లోనే! -
వార్నర్‌కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన ప్రతీ పాట ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ఈ పాటకు బన్ని, పూజా హెగ్డె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ కూడా ఈ పాటకు ఫిదా అయ్యాడు. దీంతో తన భార్య క్యాండిస్‌తో కలిసి బుట్టబొమ్మ పాటకు కాలు కదిపాడు వార్నర్. అంతేకాకుండా ఈ పాటకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. కాగా వార్నర్-క్యాండిస్‌ల డ్యాన్స్‌పై బన్ని స్పందించాడు. ‘ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ధ్యాంక్యూ వెరీ మచ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక గీతా ఆర్ట్స్ కూడా వార్నర్-క్యాండిస్‌ల డ్యాన్స్ వీడియోను తమ అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ ‘బుట్టబొమ్మ’ పాట సరిహద్దులను చెరిపివేసిందంటూ ట్వీట్ చేసింది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ వీరిద్దరి డ్యాన్స్‌ను వీడియోను ట్విటర్లో షేర్ చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఓ తెలుగు సినిమా పాటకు విదేశీ స్టార్ క్రికెటర్ డ్యాన్స్ చేయడం పట్ల అటు చిత్ర బృందం ఇటు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా బుట్ట బొమ్మ హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. చదవండి: బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య థాంక్యూ తమన్.. మాట నిలబెట్టుకున్నావ్ When ur world 🌍 is under lockdown And At the same time to knw tat the music u have made has reached millions & billions across the globe makes u feel great ♥️ #avpl 💪🏼 Here is #sensationalbuttabomma #ButtaBomma from the famous @CricketAus @davidwarner31 ♥️ This is wow 🏏 pic.twitter.com/8maTslqui7 — thaman S (@MusicThaman) April 30, 2020 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_951255110.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విశాఖ ఉత్సవ్ వైభవోపేతం
-
వెంకీ మామ : మూవీ రివ్యూ
-
అలా చేస్తే ‘నో ఎగ్జిట్’!
‘‘సినిమా హిట్టూ, ఫ్లాపులు మన చేతుల్లో ఉండవు. పనికి ద్రోహం చేయకూడదు. మన వంతు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కమర్షియల్ అండ్ లవ్‌స్టోరీ మూవీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యూజిక్ చేయాలన్నదే నా డ్రీమ్. మన పని మనం కరెక్ట్‌గా చేసినప్పుడు మనకి ఎగ్జిట్ లేదని నమ్ముతాను’’ అన్నారు సంగీత దర్శకలు తమన్. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు. ► ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు 900 సినిమాలకు 64 మ్యూజిక్ డైరెక్టర్లతో వర్క్ చేశాను. ‘అన్నమయ్య’ సినిమాకు పని చేసినప్పుడు నాకు 14 ఏళ్లు. పక్కవాళ్లు చేసిన టోన్ ఒకటి రాఘవేంద్రరావుగారికి నచ్చలేదు. త్రీడేస్ వెయిట్ చేశాను... నా సౌండ్ ఆయనకు వినిపించడానికి. విన్న తర్వాత రాఘవేంద్రరావుగారు ఫైనలైజ్ చేశారు. నాకది ప్రౌడ్ మూమెంట్. మ్యూజిక్ డైరెక్టర్‌గా సెంచరీ సినిమాలకు ఇంకా 28 ఫిల్మ్స్ దూరంలో ఉన్నాను. ఫస్ట్ 50 సినిమాలు చాలా స్పీడ్‌గా చేసేశాను. ప్రజెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను. ► రెహమాన్‌గారు, ఇళయరాజాగారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ఇంకా కాంపిటేటర్స్గా ఉన్నారు. 8 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చి పాతికేళ్లవుతోంది. రాజ్–కోటి, కీరవాణì , మహదేవన్, చక్రవర్తిగార్లను చూసి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలి. చక్రవర్తిగారి దగ్గర మా నాన్నగారు డ్రమ్మర్‌గా ఆల్మోస్ట్ వెయ్యి సినిమాలకు వాయించారు. వాళ్ల పేషెన్స్ లెవల్ సూపర్. టాలెంట్ ఉన్నవారిని ఎవరూ ఆపలేరు. ► రాశీ ఖన్నా మంచి సింగర్. సాయిధరమ్ తేజ్‌తో చెప్పాను. ఓకే అన్నారు. అందుకే ‘జవాను’ సినిమాలో ‘బంగారు..’ సాంగ్ పాడించాం. తేజ్ అందరికీ నచ్చుతాడు. తేజ్, నేను క్లోజ్ ఫ్రెండ్స్. తన సినిమాకు మంచి పాటలు ఇవ్వాలనుకుంటాను. ‘జవాను’ సినిమాతో పాటు పాటలు కూడా సూపర్‌హిట్ అవుతాయి. ఈ సినిమాలో శ్రేయా ఘోషల్ పాడిన ‘ఔనన్నా..కాదన్నా’ సాంగ్ నా బర్త్‌డే రోజున విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆ మధ్య లండన్ వెళ్లినప్పుడు కొత్త స్టూడియో కోసం కొన్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాం. వాటిని ఓపెన్ చేసి వర్క్ చేయడమే నా బర్త్‌డే మేజర్ సెలబ్రేషన్స్. ► ప్రతి శనివారం, ఆదివారం క్రికెట్ ఆడటానికి కచ్చితంగా నేను గ్రౌండ్‌లోనే ఉంటాను. పబ్‌లకు, డిస్కోలకు పెద్దగా వెళ్లను. మ్యూజిక్ చేయకపోతే తప్పకుండా క్రికెటర్ని అయ్యుండేవాణ్ణి. పాటలను రాయాలనుకోవడం లేదు. మన ఇండస్ట్రీలో బెస్ట్ సింగర్స్ చాలామంది ఉన్నారు. మళ్లీ యాక్టింగ్ వైపు ఆలోచన లేదు. స్టేజ్‌పై పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ముందు వెయిట్ తగ్గాలి. ఫ్యూచర్లో చూద్దాం. మన తప్పుల్ని ఎత్తి చూపేవారిని కూడా రెస్పెక్ట్ చేయాలి. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటా. ► హిందీ ‘గోల్మాల్ ఎగైన్’ సినిమాకు ఓ పాటకి సంగీతం అందించా. ‘టెంపర్’ హిందీ రీమేక్‌కు కూడా మ్యూజిక్ చేయబోతున్నాను. ఇండస్ట్రీ బాడీ అయితే ఫ్యాన్స్ బ్లడ్ అన్నమాట. అందరి హీరోల ఫ్యాన్స్ గొప్పవారు. ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేది ఫ్యాన్సే. -
సినిమా రివ్యూ: రభస
ప్లస్ పాయింట్స్: జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సమంత, ప్రణీత గ్లామర్, బ్రహ్మానందం కామెడీ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, పేలవమైన కథనం మితిమీరిన ఫైట్స్ ఓ అమ్మాయి ప్రేమను కాపాడే పయత్నంలో మరో అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతాడు కార్తీక్(జూనియర్ ఎన్టీఆర్). తన తండ్రి(నాజర్) అవమానించిన తన మేనమామ ధనుంజయ్ (షియాజీ షిండే) బుద్ది చెప్పి, తన తల్లి కోరిక మేరకు తన మరదలు చిట్టి అలియాస్ ఇందు(సమంత)ను పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ చేరుకుంటారు. తన మరదలు అని తెలియకపోవడంతో మొదటి కలయికలోనే ఇందు,కార్తీక్ ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. తన మరదలిని ప్రేమలోకి దించే ప్రయత్నంలో భాగ్యం(ప్రణితి)ను ఇందుగా భావించి ప్రేమలోకి దింపుతాడు. కార్తీక్ చెడ్డవాడు అనే భావనలో ఉన్న ఇందు..వారిద్దరి విడగొడుతుంది. భాగ్యంతో ప్రేమను విడగొట్టిన ఇందు అప్పటికే తనకు తెలియని వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తన తండ్రి ప్రయత్నాలకు దూరంగా పారిపోవడానికి కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. కథ ఇలా నడుస్తుండగా.. పెద్దిరెడ్డి (జయప్రకాశ్) ఓబుల్ రెడ్డి (అజయ్)ల గ్యాంగ్ కార్తీక్ కోసం వెదుకుతుంటారు. ఓదశలో కార్తీక్, ఇందులు పెద్దిరెడ్డి ఇంట్లోకే చేరుతారు. తనను వెతుకున్న విలన్ల ఇంటికి చేరిన కార్తీక్ ఏం చేశాడు. ఇందు తన మరదలే అని తెలుసుకున్నాడా? తెలియని వ్యక్తితో ప్రేమలో పడిన ఇందు తన ప్రేమికుడిని కలుసుకుందా? పెద్దిరెడ్డి, ఓబుల్ రెడ్డిలు కార్తీక్ ను ఎందుకు వెతుకుతున్నారు? అయితే ఇందు తన మరదలు అని తెలుసుకుంటాడా? తన కారణంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు? తన మామ ధనుంజయ్ ను ఎలా కన్విన్స్ చేసి ఇందును పెళ్లి చేసుకున్నాడా? అనే పలు ప్రశ్నలకు సమాధానమే 'రభస' ప్రేమికుడిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఓ వ్యక్తిగా, తన తల్లిని మాటను తీర్చే కోడుకుగా, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న రెండు ఫ్యాక్షన్ల కుటుంబాలను కలిపే మనసున్న మనిషిగా, తన మేనమామకు తగిన గుణపాఠం నేర్పే అల్లుడిగా.. పలు విభిన్న షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశాడు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రయోగాలకు చోటివ్వకుండా చాలా సేఫ్ గా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. సమంత పాత్ర ప్రధానంగా గ్లామర్ కే పరిమితమైన, కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. ప్రణీత రెండో హీరోయిన్ గా కనిపించి.. కథానుగుణంగా కనిపించి మాయమవుతుంది. ప్రణీత కెరీర్ కు పెద్గగా ప్లస్ అవుతుందని చెప్పడం కష్టమే. రాజు పాత్రలో కనిపించిన బ్రహ్మనందం రోటిన్ కారెక్టర్ అయినప్పటికి.. ద్వితీయార్ధంలో సినిమా భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఫైట్స్ తో విసిగించే సమయంలో రాజుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు బ్రహ్మనందం కొంత రిలీఫ్ కలిగించాడు. జయప్రకాశ్, నాగినీడు, అజయ్, షియాజీ షిండే, నాజర్, జయసుధలు తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. సాంకేతిక నిపుణులు పనితీరు: సాంకేతిక విభాగంలో ముఖ్యంగా శ్యామ్ కే నాయుడును అందించిన ఫోటోగ్రఫి బాగుంది. లోకేషన్లు ఆందంగా చిత్రీకరించి.. రభసకు అదనపు ఆకర్షణగా మారారు. ఈ చిత్ర నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉంది. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు మరింత పదను పెట్టాల్సిందే. ఓ రెండు పాటలు మినహా తమన్ ప్రభావవంతమైన సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. ఎమోషన్ సీన్స్ లో నేపథ్యం సంగీతంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేదనిపిస్తోంది. 'కందిరీగ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శ్రీనివాస్ రభస కథ, కథనాన్ని చాలా కాంప్లికేటెడ్ పంథాలోనే కొనసాగించాడు. అనేక ట్విస్టులు, గందరగోళంగా ఉండే కథనంతో ప్రేక్షకుడిని అక్కడక్కడా కన్ ఫ్యూజ్ చేస్తుంది. కథాగమనంలో అనేక మలుపులు సహజంగా ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. కేవలం కమర్షియల్ ఆంశాలను బేరిజు వేసుకుని కథ, కథనంపై దృష్టిపెట్టారనేది సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. అయితే తొలిభాగంలో ఓపెన్ చేసిన ట్విస్టులకు ద్వితీయార్ధంలో క్లోజ్ చేసిన తీరు, విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. చిత్ర ద్వితీయార్ధంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు దర్శకుడి ప్రతిభకు అద్దపడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రయోగాలకు చోటివ్వకుండా టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాతో కథను పట్టాలెక్కించి.. సేఫ్ గా గమ్యాన్ని చేర్చేందుకు చేసిన ప్రయత్నం కొంత వర్కవుట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రంగా కాకుండా.. ఓ రకమైన సంతృప్తిని కలిగించే చిత్రంగా 'రభస' రూపొందింది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరణపైనే రభస సక్సెస్, కమర్షియల్ గా ఏరేంజ్ లో వర్కవుట్ అయిందనే అంశాలు అధారపడి ఉన్నాయి. -రాజబాబు అనుముల