మొదటిసారిగా భార్య, కొడుకు గురించి చెప్పిన తమన్.. | Thaman About His Wife And Son Says Doing Stage Shows With Wife | Sakshi
Sakshi News home page

Thaman: ఆమెతో కలిసి స్టేజ్ షో చేయాలని ఉంది తమన్‌

Published Wed, May 18 2022 9:25 PM | Last Updated on Wed, May 18 2022 9:30 PM

Thaman About His Wife And Son Says Doing Stage Shows With Wife - Sakshi

Thaman About His Wife And Son Says Doing Stage Shows With Wife: టాలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తమన్. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలే సర్కారు వారి పాట మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్న తమన్‌.. ప్రస్తుతం గాడ్‌ ఫాదర్‌, రామ్‌చరణ్‌-15 చిత్రాలకు మ్యూజిక్‌ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భార్య, కొడుకు గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్లే బ్యాక్ సింగర్‌ అయిన శ్రీ వర్ధినిని తమన్‌ వివాహం చేసుకున్నాడు. ఆమె గతంలో మణిశర్మ, యువన్‌ శంకర్‌ రాజాతో పనిచేసింది. తమన్‌ డైరెక్షన్‌లోనూ నాలుగు పాటలు పాడింది. 

'వర్ధిని వాయిస్ బాగుంటుందని డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లకు అనిపిస్తే పాడిస్తారు. భవిష్యత్తులో ఆమెతో కలిసి స్టేజ్‌ షోలు చేయాలని ఉంది. అయితే దానికన్నా ముందు ఆమె రెండు మూడు సూపర్‌ హిట్ పాటలను పాడాలి.' అని తమన్‌ పేర్కొన్నాడు. ఇక తన కొడుకు గురించి చెబుతూ 'నా ట్యూన్‌లను మొదటగా విని అభిప్రాయం చెబుతాడు. మ్యూజిక్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడటంలో అతడికీ మంచి పట్టు ఉంది. పియానోలో నాలుగో గ్రేడ్‌ పూర్తి చేశాడు. అతడు ఏ వృత్తి ఎంచుకుంటాడో నాకు తెలియదు.' అని తమన్‌ వెల్లడించాడు. 

చదవండి: మహేశ్‌ బాబుపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement