నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. బుధవారం బాలయ్య బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ చిన్న టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. అయితే అందరూ ఊహించినట్లు మూవీ టైటిల్‌ను చిత్రబృందం రివీల్ చేయలేదు. (‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?)
64 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో నందమూరి అభిమానులకు కావాల్సిన పూర్తి విందు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెల్లటి దుస్తులు, గుబురు మీసాలతో మాస్ లుక్‌లో బాలయ్య కనిపించారు. ఆయన చెప్పిన ఫవర్ ఫుల్ డైలాగ్‌లు, శత్రుగణాన్ని గాల్లోకి ఎగిరేసి కొట్టడం వంటి సీన్లు టీజర్‌లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ సినిమా కోసం బాలయ్య భారీగానే బరువు తగ్గినట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. (బాలయ్య కోసం భారీగా శత్రు గణం)
Comments
Please login to add a commentAdd a comment