
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అల..వైకుంఠపురుములో’. సంక్రాంతి కానుగా వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలసిందే. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా మ్యూజికల్‌గా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ ఆణిముత్యంగా నిలిచింది. ‘సామజవరగమనా’ సోషల్ మీడియాలో ఎంతటి ట్రెండ్ సృష్టించిందో చిత్రంలోని ప్రతీపాట యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి.
తాజాగా ఈ చిత్రంలోని ‘రాములో రాములా’ పాట మరో రికార్డును అందుకుంది. యూత్‌ను ఉర్రూతలూగించిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పాటను తమన్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత వన్నె తెచ్చింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సుశాంత్, నివేదా పేతురాజు, మరళీ శర్మ, టబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించింది.
100 Million+ Views for #RamulooRamulaa Full Video Song 🤩
— Geetha Arts (@GeethaArts) May 12, 2020
► https://t.co/YcVsDat7d6 #AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @anuragkulkarni_ @LyricsShyam #Mangli #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @haarikahassine @adityamusic pic.twitter.com/sfqNERoUPv
చదవండి:
‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’
ముంబై కాదు... హైదరాబాద్‌లోనే!