‘అల..వైకుంఠపురములో’.. 1 బిలియన్‌ వ్యూస్‌ | Ala Vaikuntapuramlo Movie Music Album Gets 1 Billion Views In Youtube | Sakshi
Sakshi News home page

‘అల..వైకుంఠపురములో’.. 1 బిలియన్‌ వ్యూస్‌

Published Sat, May 16 2020 6:51 PM | Last Updated on Sat, May 16 2020 7:37 PM

Ala Vaikuntapuramlo Movie Music Album Gets 1 Billion Views In Youtube - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి తమన్‌ అందించిన బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ సంచలనమే. ఇక తమన్‌ కెరీర్ లోనే అదిరిపోయే ఆల్బమ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సాంగ్‌ నుంచి సినిమా విడుదల వరకు క్షణక్షణం అనేక రికార్డులను సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. 

అల వైకుంఠపురములో మ్యూజిక్‌ ఆల్బమ్‌కు యూట్యూబ్‌లో వన్‌ బిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. అంటే అక్షరాలా వంద కోట్ల వ్యూస్ అన్నమాట. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్‌కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే తొలిసారి. అల వైకుంఠపురములో.. ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో బిలియన్ వ్యూస్ వచ్చాయి.. మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. మొత్తానికి సినిమా విడుదలై ఆర్నెళ్లవుతున్నా కూడా అల వైకుంఠపురములో రికార్డుల హోరు జోరు మాత్రం తగ్గట్లేదు. 

చదవండి:
‘బుట్టబొమ్మ’కు పీటర్సన్‌ కూడా..
‘నా దేశం అమితాబ్‌, షారుఖ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement