స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘‘అల వైకుంఠపురములో’ సినిమా ఏన్నో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసి, పలు సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టినవి. ఇక ఈ సినిమా విడుదలై సోమవారానికి ఏడాది పూర‍్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం మళ్ళీ రీ యూనియన్ ను హైదరాబాద్ లోని అల్లు వారి ఆఫీస్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొంత ఎమోషనల్ గా మాట్లాడాడు.
‘గత ఏడాది సంక్రాంతి తరువాత 2020 అనేది ప్రపంచానికి చాలా బ్యాడ్ ఇయర్ గా నడిచింది. అయితే నాకు మాత్రం అలా కాదు. నేను బ్యాడ్ ఇయర్ అని చెప్పలేను. ఎందుకంటే నా లైఫ్ మొత్తంలో ఇలాంటి విజయాన్ని నేను చూడలేదు. సినిమా విడుదలై ఏడాది అయినా ఇంకా ఏదో ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఒకవేళ సినిమాను సంక్రాంతికి కాదని సమ్మర్ లో విడుదల చేసి ఉంటే ఈ స్థాయిలో విజయాన్ని అందుకొని ఉండేది కాదేమో. కోవిడ్ కు ముందు ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చున్నాను. ఆ తరువాత కూడా మళ్లీ ఇంట్లోనే కూర్చున్నాను. కానీ ఈ మధ్యలో వచ్చిన అల.. వైకుంఠపురములో విజయం ఎంతగానో ఎనర్జీని ఇచ్చింది.
ఈ సందర్భంగా నేను మీ అందరితో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి నటుడికీ ఏదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. జర్నీలో అదొక బ్యూటిఫుల్ మైల్‌స్టోన్ అవుతుంది. ఉదాహరణకు.. కళ్యాణ్ గారికి ‘ఖుషి’ ఆల్ టైమ్ రికార్డ్. అది ఆయన ఏడో సినిమా అనుకుంటా. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏడో సినిమా ‘సింహాద్రి’ ఆల్ టైమ్ రికార్డ్ ఫిలిం. చరణ్‌కి రెండో సినిమా ఆల్ టైమ్ రికార్డ్. ఇలా అందరికీ ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఉంది. నాకెప్పుడు పడుతుందని నేను కూడా అనుకునేవాడిని. అందరికీ చాలా ముందుగా పడింది.. నాకు 20 సినిమాలు పట్టింది. ఇది నా మొదటి అడుగు. ఇకపై నేనేంటో చూపిస్తా. సినిమా సక్సెస్‌కు కృషి చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. అందరు ప్రేమతో చేస్తే.. అందరి కంటే ఎక్కువ లాభం పొందింది నేను. తమన్‌కు అయితే డబుల్ థాంక్యూ చెప్పాలి. నేను వన్ బిలియన్ ఆల్బమ్ అడిగితే.. నాకు టు బిలియన్ల కంటే ఎక్కువ అల్బమ్ ఇచ్చాడు’ అని తమన్‌పై బన్నీ ప్రశంసలు కురుపించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రామిస్.. ఇకపై నేనేంటో చూపిస్తా: అల్లు అర్జున్
Published Tue, Jan 12 2021 11:07 AM | Last Updated on Tue, Jan 12 2021 1:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment