68th National Film Awards: Colour Photo Movie Wins Best Telugu Film Award - Sakshi
Sakshi News home page

68th National Film Awards: తెలుగు సినిమాలకు అవార్డుల పంట

Published Fri, Jul 22 2022 4:40 PM | Last Updated on Fri, Jul 22 2022 7:58 PM

National Film Awards: Colour Photo Wins Best Telugu Film Award - Sakshi

కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది.  2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన కలర్‌ ఫొటో ఎంపికైంది.

ఉత్తమ సంగీత దర్శకుడిగా అల వైకుంఠపురములో చిత్రానికి గానూ తమన్‌కు అవార్డు వరించింది. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకంగా ఐదు అవార్డులు వచ్చి పడ్డాయి. మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌గా మధ్యప్రదేశ్‌ నిలిచింది.  బెస్ట్‌ క్రిటిక్‌ అవార్డు ప్రకటనను మాత్రం కేంద్రం వాయిదా వేసింది.  

మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ - మధ్యప్రదేశ్‌
ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌): - తమన్‌ (అల వైకుంఠపురములో)
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌) : జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (సూరరై పోట్రు -తమిళ్‌)
బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం: సూరరై పోట్రు
బెస్ట్‌ స్టంట్స్‌ - అయ్యప్పనుమ్‌ కోషియమ్‌
ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: టీవీ రాంబాబు - నాట్యం

ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివరంజనీయం ఇన్నుమ్‌ శిల పెంగళమ్‌)
ఉత్తమ సహాయ నటుడు: బిజు మీనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌- మలయాళం)
ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు- తమిళ్‌)
ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు)
ఉత్తమ నటుడు (షేర్‌డ్‌): అజయ్‌ దేవ్‌గణ్‌ (తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌- హిందీ)
ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్‌ కేఆర్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌)
ఉత్తమ పిల్లల చిత్రం: సుమి(మరాఠి)
బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: నాంచమ్మ (అప్పయ్యప్పనుమ్‌ కోషియమ్‌- మలయాళం)
బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: రాహుల్‌ దేశ్‌పాండే (మీ వసంతరావు - మరాఠీ)

ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనీయం ఎన్నుమ్‌ శిల పెంగల్లమ్‌ (తమిళ్‌)
ఉత్తమ మలయాళ చిత్రం: థింకలియా నిశ్చయమ్‌
ఉత్తమ కన్నడ చిత్రం: డొల్లు
ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్‌ జూనియర్‌
ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ): అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ (మలయాళం)
ఉత్తమ లిరిక్స్‌: సైనా(హిందీ) - మనోజ్‌ ముంతషిర్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నచికెత్‌ బర్వె, మహేశ్‌ షెర్లా (తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: అనీస్‌ నాడోడి (కప్పేలా -మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ (శివరంజనీయం ఎన్నుమ్‌ శిల పెంగల్లమ్‌ -తమిళ్‌)

బెస్ట్‌ ఆడియోగ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌): జాబిన్‌ జయన్‌ (డోలు- కన్నడ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (సౌండ్‌ డిజైనర్‌) : అన్మూల్‌ భావే (మీ వసంతరావు- మరాఠీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌: విష్ణు గోవింద్‌, శ్రీశంకర్‌ (మలిక్‌- మలయాళం)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌):షాలిని ఉషా నాయర్‌, సుధా కొంగర (సూరరై పోట్రు - తమిళ్‌)
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (డైలాగ్‌ రైటర్‌) : మడోన్నా అశ్విన్‌ (మండేలా- తమిళ్‌)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ:  సుప్రతీమ్‌ భోల్‌ (అవిజాత్రిక్‌- బెంగాలీ)
ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: అనీష్‌ మంగేశ్‌ గోసావి (టక్‌ టక్‌- మరాఠీ), ఆకాంక్ష పింగ్లే, దివ​ఏశ్‌ ఇందుల్కర్‌ (సుమీ- మరాఠీ)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ ఎన్వైర్‌మెంట్‌ కంజర్వేషన్‌: తాలెడండ(కన్నడ)
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: ఫ్యునెరల్‌ (మరాఠి)
బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌: తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌
ఇందిరాగాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌: మడోన్న అశ్విన్‌ (మండేలా- తమిళ్‌)
 

నాన్‌ ఫీచర్‌ ఫిలింస్‌
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌  (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌  భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)
ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)
 ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)
ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)
బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)
బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)
బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )
బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)
బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)
బెస్ట్‌ ప్రమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫిలిం: ఆన్‌ ద బ్రింక్‌ సీజన్‌ 2- బ్యాట్స్‌ (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ ఫిలింస్‌: నాదదా నవనీతా
బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిలిం: పబుంగ్‌ శ్యామ్‌
బెస్ట్‌ ఎత్నోగ్రాఫిక్‌ ఫిలిం: మందల్‌ కె బోల్‌ (హిందీ)
బెస్ట్‌ డెబ్యూ నాన్‌ ఫియేచర్‌ ఫిలిం ఆఫ్‌ ఎ డైరెక్టర్‌: విశేష్‌ అయ్యర్‌ (పరాయా- మారాఠీ, హిందీ)

చదవండి: కిస్, అత్యాచార సీన్లు మాత్రమే చేయమంటున్నారు: నటి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement