దేశ రాజధాని ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డులు ప్రదానం చేశారు. డిల్లీలోని విఘ్నయన్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక కలిసి హాజరయ‍్యారు తమిళ హీరో సూర్య.
సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుుకంది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment