వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌ | ButtaBomma Song: Allu Arjun Say Thanks To Warner | Sakshi
Sakshi News home page

వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌

Published Thu, Apr 30 2020 3:47 PM | Last Updated on Thu, Apr 30 2020 3:50 PM

ButtaBomma Song: Allu Arjun Say Thanks To Warner - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ అందించిన ప్రతీ పాట ఓ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. ఈ పాటకు బన్ని, పూజా హెగ్డె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ కూడా ఈ పాటకు ఫిదా అయ్యాడు. దీంతో తన భార్య క్యాండిస్‌తో కలిసి బుట్టబొమ్మ పాటకు కాలు కదిపాడు వార్నర్‌. అంతేకాకుండా ఈ పాటకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అయింది. 

కాగా వార్నర్‌-క్యాండిస్‌ల డ్యాన్స్‌పై బన్ని స్పందించాడు. ‘ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ధ్యాంక్యూ వెరీ మచ్‌‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక గీతా ఆర్ట్స్‌ కూడా వార్నర్‌-క్యాండిస్‌ల డ్యాన్స్‌ వీడియోను తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘బుట్టబొమ్మ’ పాట సరిహద్దులను చెరిపివేసిందంటూ ట్వీట్‌ చేసింది. అదేవిధంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ వీరిద్దరి డ్యాన్స్‌ను వీడియోను ట్విటర్‌లో షేర్‌ చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఓ తెలుగు సినిమా పాటకు విదేశీ స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌ చేయడం పట్ల అటు చిత్ర బృందం ఇటు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా బుట్ట బొమ్మ హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. 

చదవండి:
బుట్టబొమ్మగా మారిన వార్నర్‌ భార్య
థాంక్యూ తమన్‌.. మాట నిలబెట్టుకున్నావ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement