డాన్ గెటప్‌లో డేవిడ్ వార్నర్.. 'పుష్ప 2' కోసమేనా? | Cricketer David Warner Acting In Melbourne, Pics Viral | Sakshi
Sakshi News home page

David Warner: వార్నర్ ఇకపై క్రికెటర్ కాదు యాక్టర్

Published Fri, Sep 20 2024 10:55 AM | Last Updated on Fri, Sep 20 2024 11:40 AM

Cricketer David Warner Acting In Melbourne, Pics Viral

డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది క్రికెటర్ అని. మనోళ్లని అడిగితే మాత్రం క్రికెటర్ కమ్ యాక్టర్ అని అంటారు. ఎందుకంటే లాక్‌డౌన్ ముందు వార్నర్‌కి తెలిసిందల్లా క్రికెట్. కానీ కరోనా వల్ల ఇంట్లో ఉండేసరికి టిక్ టాక్‌లో భార్యతో కలిసి రీల్స్ చేశాడు. వాటిలో తెలుగు పాటలు బోలెడు. అలా ఊహించని క్రేజ్ తెచ్చుకున్నాడు.

మరీ ముఖ్యంగా 'పుష్ప'లో అల్లు అర్జున్ ఇమిటేట్ చేయడం డేవిడ్ వార్నర్‌కి చాలా ఇష్టం. ఐపీఎల్, మిగతా మ్యాచుల్లో గ్రౌండ్‌లో ఫీల్టింగ్ చేస్తూ 'శ్రీవల్లి' పాటలోని స్టెప్ ఎన్నిసార్లు వేసుంటాడో లెక్కే లేదు. అలా రీల్స్ పుణ్యమా అని కొన్నాళ్ల క్రితం ఏకంగా రాజమౌళితో కలిసి ఓ యాడ్‌లో కనిపించాడు. అందులో వార్నర్ తన యాక్టింగ్‌తో తెగ నవ్వించేశాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)

ఇక 'పుష్ప' ఇమిటేషన్‌కి ఫిదా అయిపోయిన తెలుగు మూవీ లవర్స్.. సీక్వెల్‌లో ఇతడికి సినిమాలో చిన్న పాత్ర అయినా ఇవ్వాలని డైరెక్టర్ సుకుమార్‌ని ఎప్పటినుంచో సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. మరి అది నిజమైందో ఏమో తెలీదు గానీ ఇప్పుడు వార్నర్ యాక్టింగ్ చేస్తూ కనిపించాడు.

మెల్‌బోర్న్‌లో తాజాగా వార్నర్.. హెలికాప్టర్ నుంచి దిగి గన్ పట్టుకుని నడుస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదంతా కూడా ఓ భారతీయ సినిమా కోసమని మాట్లాడుకుంటున్నారు. అయితే అది 'పుష్ప 2' కోసమైతే బాగుండు అని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే గనక రచ్చ రచ్చే.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement