Allu Arjun Reply To Australia Star Cricketer David Warner Comment On Pushpa 2 Song Hook Step, Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun-David Warner: 'ఆ స్టెప్‌కు వార్నర్‌ ఫిదా .. నేను కూడా స్టార్ట్‌ చేస్తా'

Published Fri, May 3 2024 2:23 PM | Last Updated on Fri, May 3 2024 3:34 PM

Allu Arjun Reply To Australia Star Cricketer David Warner

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్‌ రిలీజ్‌ చేసన మేకర్స్‌ మరో సాలిడ్‌ అప్‌డేట్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను ఇటీవలే రిలీజ్‌ చేశారు.

ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్‌లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్‌ విపరీతమైన క్రేజ్‌ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న‌ వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్‌ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్‌ ప్రాక్టీస్‌ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.

అయితే డేవిడ్ వార్నర్‌ కామెంట్‌కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్‌ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్‌లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. అల్లు అర్జున్‌కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్‌తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement