అలా చేస్తే ‘నో ఎగ్జిట్‌’! | S Thaman Birthday Interview | Sakshi
Sakshi News home page

అలా చేస్తే ‘నో ఎగ్జిట్‌’!

Published Thu, Nov 16 2017 3:13 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

S Thaman Birthday Interview - Sakshi

‘‘సినిమా హిట్టూ, ఫ్లాపులు మన చేతుల్లో ఉండవు. పనికి ద్రోహం చేయకూడదు. మన వంతు బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలి. కమర్షియల్‌ అండ్‌ లవ్‌స్టోరీ మూవీస్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ మ్యూజిక్‌ చేయాలన్నదే నా డ్రీమ్‌. మన పని మనం కరెక్ట్‌గా చేసినప్పుడు మనకి ఎగ్జిట్‌ లేదని నమ్ముతాను’’ అన్నారు సంగీత దర్శకలు తమన్‌. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు.
     
► ఆల్‌ ఓవర్‌ ఇండియాలో దాదాపు 900 సినిమాలకు 64 మ్యూజిక్‌ డైరెక్టర్లతో వర్క్‌ చేశాను. ‘అన్నమయ్య’ సినిమాకు పని చేసినప్పుడు నాకు 14 ఏళ్లు. పక్కవాళ్లు చేసిన టోన్‌ ఒకటి రాఘవేంద్రరావుగారికి నచ్చలేదు. త్రీడేస్‌ వెయిట్‌ చేశాను... నా సౌండ్‌ ఆయనకు వినిపించడానికి. విన్న తర్వాత రాఘవేంద్రరావుగారు ఫైనలైజ్‌ చేశారు. నాకది ప్రౌడ్‌ మూమెంట్‌. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సెంచరీ సినిమాలకు ఇంకా 28 ఫిల్మ్స్‌ దూరంలో ఉన్నాను. ఫస్ట్‌ 50 సినిమాలు చాలా స్పీడ్‌గా చేసేశాను. ప్రజెంట్‌ డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్నాను.

► రెహమాన్‌గారు, ఇళయరాజాగారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ఇంకా కాంపిటేటర్స్‌గా ఉన్నారు. 8 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చి పాతికేళ్లవుతోంది. రాజ్‌–కోటి, కీరవాణì , మహదేవన్, చక్రవర్తిగార్లను చూసి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలి. చక్రవర్తిగారి దగ్గర మా నాన్నగారు డ్రమ్మర్‌గా ఆల్మోస్ట్‌ వెయ్యి సినిమాలకు వాయించారు. వాళ్ల పేషెన్స్‌ లెవల్‌ సూపర్‌. టాలెంట్‌ ఉన్నవారిని ఎవరూ ఆపలేరు.

► రాశీ ఖన్నా మంచి సింగర్‌. సాయిధరమ్‌ తేజ్‌తో చెప్పాను. ఓకే అన్నారు. అందుకే ‘జవాను’ సినిమాలో ‘బంగారు..’ సాంగ్‌ పాడించాం. తేజ్‌ అందరికీ నచ్చుతాడు. తేజ్, నేను క్లోజ్‌ ఫ్రెండ్స్‌. తన సినిమాకు మంచి పాటలు ఇవ్వాలనుకుంటాను. ‘జవాను’ సినిమాతో పాటు పాటలు కూడా సూపర్‌హిట్‌ అవుతాయి. ఈ సినిమాలో శ్రేయా ఘోషల్‌ పాడిన ‘ఔనన్నా..కాదన్నా’ సాంగ్‌ నా బర్త్‌డే రోజున విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆ మధ్య లండన్‌ వెళ్లినప్పుడు కొత్త స్టూడియో కోసం కొన్ని కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్‌ కొన్నాం. వాటిని ఓపెన్‌ చేసి వర్క్‌ చేయడమే నా బర్త్‌డే మేజర్‌ సెలబ్రేషన్స్‌.

► ప్రతి శనివారం, ఆదివారం క్రికెట్‌ ఆడటానికి కచ్చితంగా నేను గ్రౌండ్‌లోనే ఉంటాను. పబ్‌లకు, డిస్కోలకు పెద్దగా వెళ్లను. మ్యూజిక్‌ చేయకపోతే తప్పకుండా క్రికెటర్‌ని అయ్యుండేవాణ్ణి. పాటలను రాయాలనుకోవడం లేదు. మన ఇండస్ట్రీలో బెస్ట్‌ సింగర్స్‌ చాలామంది ఉన్నారు. మళ్లీ యాక్టింగ్‌ వైపు ఆలోచన లేదు. స్టేజ్‌పై పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలంటే ముందు వెయిట్‌ తగ్గాలి. ఫ్యూచర్‌లో చూద్దాం. మన తప్పుల్ని ఎత్తి చూపేవారిని కూడా రెస్పెక్ట్‌ చేయాలి. అందుకే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటా.

► హిందీ ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ సినిమాకు ఓ పాటకి సంగీతం అందించా. ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌కు కూడా మ్యూజిక్‌ చేయబోతున్నాను. ఇండస్ట్రీ బాడీ అయితే ఫ్యాన్స్‌ బ్లడ్‌ అన్నమాట. అందరి హీరోల ఫ్యాన్స్‌ గొప్పవారు. ఇండస్ట్రీని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లేది ఫ్యాన్సే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement