నటి శ్రీలీల అంటే సినీ ప్రియులకు టక్కున గుర్తుకువచ్చేది ఆమె డ్యాన్స్. పాట ఏదైనా సరే హీరోకి ఏమాత్రం తగ్గకుండా.. కొన్నిసార్లు హీరోలను మించి డ్యాన్స్ చేస్తారీ బ్యూటీ. మాస్ మహారాజ్ రవితేజ సినిమా అయిన ధమాకాలో ఈ బ్యూటీ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఆ సినిమాలో వీరిద్దరూ కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ స్కంద సినిమాతో సెప్టంబర్ 15న రామ్ సరసన మళ్లీ రచ్చ చేయబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను శ్రీలీల షేర్ చేసుకుంది.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో నన్నూ అలాంటి కోరికే కోరారు: ఇమ్మానుయేల్)
తాను చిన్నప్పటి అమ్మ ఒత్తిడి వల్లే భరత నాట్యం నేర్చుకున్నానని శ్రీలీల తెలిపింది. అలా చిన్నతనం నుంచే చదువుతో పాటు డ్యాన్స్ కూడా తనకు ఒక భాగం అయిపోయిందని చెప్పింది. అలా తన స్కూల్లో కూడా ఏదైనా ప్రొగ్రామ్ ఉంటే మొదట తన డ్యాన్స్ ఉండేదని చెప్పుకొచ్చింది. అలా ఒక్కోసారి డ్యాన్స్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో కాళ్లకు బొబ్బలు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. అప్పుడు డ్యాన్స్ అపేస్తానని తన అమ్మతో చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. డ్యాన్స్ నేర్చుకోమనే ప్రోత్సహించేదని తెలిపింది. ఆ తరువాత తనకే డ్యాన్స్ మీద మక్కువ పెరిగిందని చెప్పింది.
సినిమా ఎంట్రీ ఎలా జరిగిందంటే
శ్రీలీల అమ్మగారు స్వర్ణలత బెంగళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా కొనసాగుతున్నారని తెలిసిందే. సినిమాల్లోకి ఎంట్రీ ఎలా జరిగిందో శ్రీలీల ఇలా షేర్ చేసింది. ' అమ్మ డాక్టర్ కావడంతో నాకు స్కూల్లో సెలవులు వస్తే నన్ను కూడా మెడికల్ కాన్ఫరెన్సులకు తీసుకెళ్తూ ఉండేది. ఈ కారణం వల్ల నాకు కూడా వైద్య వృత్తి మీద చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. నా ప్రతి పుట్టినరోజు నాడు ఫోటో షూట్ చేయించడం అమ్మకు ఇష్టం.. అలా ఓ సారి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భువన గౌడతో ఫోటో షూట్‌ను అమ్మ చేయించింది. ఫోటోలను ఆయన ఫేస్ బుక్‌లో షేర్ చేయడంతో వాటిని చూసిన కన్నడ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చాడు. అలా స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి రావడం జరిగిపోయింది.' శ్రీలీల తెలిపింది. ఆ తర్వాత తనకు డాక్టర్ కావలనే కోరిక చిన్నతనం నుంచే ఉండటంతో చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదని చెప్పింది. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విషయం తెలిసిందే.
శేఖర్ మాస్టర్‌కు సారీ
ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం వల్ల చాల బాధపడినట్లు శ్రీలీల చెప్పింది. తనకు ఎక్కువ రీటేక్స్ తీసుకోవడం ఏ మాత్రం నచ్చదని తెలిపింది. షూటింగ్‌లో ఎక్కువ రీటేక్స్ తీసుకుంటే సమయంతో పాటు నిర్మాతకు కూడా ఖర్చు పెరుగుతుందని ఇది ఏ మాత్రం అంత మంచిది కాదని ఆమె తెలిపింది. అలా ఓ సారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ముప్పై టేకులు తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. ఆ పాట కోసం ఎన్ని సార్లు రిహార్సల్స్ చేసినా కూడా ఓకే కాలేదని తెలిపింది. అలా ముప్పై సార్లు రీటేక్స్ తీసుకోవడం చాలా బాధ అనిపించిందని చెప్పింది.
షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి సారీ చెబుతూ మూడు పేజీల లేఖను శేఖర్ మాస్టర్‌కు రాసిందట. అందుకు ఆయన కూడా తనకు ఫోన్ చేసి ఇందులో నీ తప్పేంలేదు.. ఈ పాటలో ఎక్కువ మంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారు బ్యాక్ గ్రౌండ్‌లో కరెక్ట్ స్టెప్‌లు వేయడం లేదని చెప్పాడట. అందుకే ఇన్ని రీటేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని శేఖర్ మాస్టర్ చెప్పడంతో కొంచెం సంతృప్తి అనిపించిందట.
కేజీయఫ్ ఫేమ్ యశ్‌ని ఏమని పిలుస్తుందంటే..
శ్రీలీల కుటుంబంతో కేజీయఫ్ ఫేమ్ యశ్‌కు మంచి పరిచయాలే ఉన్నాయని తెలిసిందే. శ్రీలీల అమ్మగారు గైనకాలజిస్ట్ కావడంతో యశ్ భార్య రాధికకు రెండుసార్లు ఆమె డెలివరీ చేసింది. దీంతో వారికి మంచి పరిచయాలు ఏర్పాడ్డాయి.రాధిక డెలివరి సమయంలో ఎక్కువగా ఆస్పత్రిలో శ్రీలీలే ఉండేవారట. అలా రాధికను అక్కా అని శ్రీలీల పిలుస్తుందట. అంతేకాకుండా యశ్‌ను జీజూ (బావా) అని పిలుస్తుందట. అలా తనకు కన్నడ సినిమాలో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment