రామ్-బోయపాటి స్కంద మూవీ.. యాక్షన్ ఓకే.. రీ ఎంట‍్రీ ఎలా? | Boyapati Srinu And Ram Pothineni Skanda Movie Editing Scene Errors Video Viral - Sakshi
Sakshi News home page

Skanda Movie: స్కంద మూవీ.. ఆ బ్లండర్‌ మిస్టేక్ ఏంటి బ్రో!

Published Fri, Nov 3 2023 6:44 PM | Last Updated on Sat, Nov 4 2023 9:13 AM

Boyapati Ram Pothineni Film Skanda Scene Mistake Goes Viral - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని, యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవలే ఓటీటీలో వచ్చిన స్కంద మూవీ ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. నవంబర్‌ రెండో తేదీ నుంచే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(ఇది చదవండి: రాహుల్‌ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?)

సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరగడం చూస్తుంటాం. ఎడిటింగ్‌లో అప్పుడప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం రామ్ నటించిన స్కంద చిత్రంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఈ మూవీలోని ఓ సీన్‌ విషయంలో జరిగిన అతిపెద్ద పొరపాటు తాజాగా బయటకొచ్చింది. ఓటీటీలో సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు.. ఆ సీన్‌ను కట్‌ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ సీన్‌లో జరిగిన ఆ పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకుందాం.

సినిమా కథలో భాగంగా ఏపీ సీఎం కూతురిని (అజయ్‌ పుర్కర్‌) తీసుకురావడానికి.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్‌ రెడ్డి(శరత్ లోహితస్వ) వద్దకు రామ్ వెళ్తాడు. అదే సమయంలో ఫుల్ మాస్ యాక్షన్ సీన్ ఫైట్ జరుగుతుంది. అక్కడ రామ్ పవర్‌ఫుల్‌ డైలాగ్ కూడా చెబుతాడు. అయితే ఆ సీన్‌లో ఓ ముసలోడి పిస్టల్ తీసుకుని.. నిన్ను వదలను.. చంపేస్తా అంటూ రామ్ వైపు తుపాకి గురి పెడతాడు. అయితే రామ్ అదే తుపాకితీ అతన్ని కాల్చి పడేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే సీన్‌లో చనిపోయిన ముసలోడు సీఎం వెనుక కనిపిస్తాడు. అదేంటి చనిపోయిన వ్యక్తి మళ్లీ సినిమాలో కనిపించడమేంటి? ఈ చిన్న మిస్టేక్ బోయపాటి గమనించలేకపోయాడా? అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత భారీ యాక్షన్‌ చిత్రంలో ఇలాంటి పొరపాటు ఏంటని సోషల్ మీడియా వేదికగా బోయపాటిని ఆడేసుకుంటున్నారు. 

(ఇది చదవండి: అంత అందంగా లేన‌న్నారు, వంక పెట్టారు: హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement