రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'స్కంద'. గత నెల చివర్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. కేవలం మాస్‌ని మాత్రమే ఆకట్టుకుంది. తొలి రెండు మూడు రోజులు కలెక్షన్స్ వచ్చాయి గానీ ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డల్ అయిపోయింది. గత వారం కొత్త సినిమాలు రాకతో పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?)
'స్కంద' సంగతేంటి?
బోయపాటి సినిమా అంటే లాజిక్స్ అసలు వెతకాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో తీసిన సినిమాల్లో యాక్షన్, స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ డైరెక్టర్.. 'స్కంద' విషయంలో దాన్ని పక్కనబెట్టేశాడు. అయితే ఈ మూవీ యాక్షన్ లవర్స్ కి నచ్చింది గానీ ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్‌గా నిలిచింది. లాభాల కంటే నష్టాలే వచ్చాయని తెలుస్తోంది.
ఓటీటీలోకి అప్పుడేనా?
థియేటర్లలో రిలీజ్‌కి ముందే 'స్కంద' డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజైన నెలలోపే అంటే అక్టోబరు 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు గానీ అధికారిక ప్రకటన వస్తే గానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా 'స్కంద'కి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూస్తుంటే.. రెండో భాగం తీస్తారా అనే డౌట్ వస్తోంది.
(ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!)
Comments
Please login to add a commentAdd a comment