ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘థగ్స్’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు. తమీన్స్ సింహ, ఆర్‌కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ ముఖ్య పాత్రలు చేశారు. హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో జియో
స్టూడియోస్‌తో కలిసి రియా శిబు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్స్‌ని విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తీ సురేష్ విడుదల చేశారు. తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ బృందా గోపాల్ మాట్లాడుతూ..‘‘కోనసీమ నేపథ్యంలో జరిగే రా యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి శామ్ సీఎస్ సింగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment