Choreographer Chaitanya Mother Emotional Words About Her Son Death - Sakshi
Sakshi News home page

ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్‌ తల్లి

Published Mon, May 1 2023 2:37 PM | Last Updated on Mon, May 1 2023 3:22 PM

Choreographer Chaitanya Mother Mother Emotional Words About Her Son - Sakshi

కొరియోగ్రాఫర్‌ చైతన్య ఆత్మహత్య ఘటన టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అప్పుల బాధలు తట్టుకోలేకనే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి, ఉరేసుకొని చనిపోయాడు. అయితే చైతన్య అప్పులపాలయ్యాడంటే స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. భారీగా అప్పులు చేసే అవసరం తనకు లేదని, ఒకవేళ అప్పులైనా తీర్చేంత ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని చెబుతున్నారు.

ఇక చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం అయితే తన కొడుకు అప్పుల బాధతో చనిపోయాడనేది అబద్దం అంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నా.. తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావ్‌.. నవ్వుతూ ఉండమని చెప్పా. ‘పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకొ’ చెప్పా. సరే అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్‌ చేసుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు.

(చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్‌ మాస్టర్‌ మేనమామ)

అంతకు ముందు టెంపుల్‌కి వెళ్లాలి ఇంటికి రా అంటే.. ‘నాక్కుడా చిరాకుగా ఉందమ్మా..గుడికి వెళ్దాం.. ప్లాన్‌ చెయ్‌’ అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలి అన్యాయం చేశాడు. గతంలో ఒక్కసారి ఫోన్‌ చేసి ‘నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతా’అంటే.. ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కుడా ఒక బెర్త్‌ కన్ఫామ్‌ చేయమని అన్నాడు. మరి ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. ‘నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా’అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా’ అని చైతన్య తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

(చదవండి: చైతన్య మాస్టర్‌ ఆత్మహత్య.. శ్రద్దా దాస్‌, శేఖర్‌ మాస్టర్‌ ఎమోషనల్‌ )

ఇంకా మాట్లాడుతూ.. ‘డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచూ చెప్పేవాడు. ‘పిల్లలకు మంచి ఫుడ్‌ పెడితేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బులదేముంది. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ’అని చెప్పేవాడు. ఇప్పుడు డబ్బులు వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వానా? తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పకపోవడం బాధేస్తుంది. నన్నుమోసం చేసి పోయాడు. వాడు చేసిన పనికి ఏడుపు కూడా రావడం లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది? అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే.. నాకు ద్రోహం చేశాడనే బాధే ఎక్కువగా ఉంది’అంటూ ఆమె ఎమోషనల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement