Dance Master Commits Suicide In Nalgonda, Details Inside - Sakshi
Sakshi News home page

Dance Master Suicide: డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Published Sat, Jul 15 2023 7:20 AM | Last Updated on Sat, Jul 15 2023 9:27 AM

- - Sakshi

నల్గొండ: ఉరేసుకొని డ్యాన్స్‌మాస్టర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కోదాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొమరబండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దార సురేష్‌(30) డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. వివాహం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

అతడి స్నేహితుడు ఇంటికి వెళ్లగా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని, కిందకు దించి చూసే వరకు సురేష్‌ మృతి చెంది ఉన్నాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి సోదరుడు బొబ్బిలిరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement