నిందితుడు సైదు చైతన్యవర్మ భీమవరం శ్రీ భారతీ స్కూల్ ఎదుట ధర్నా చేస్తున్న పొరుగు గ్రామస్తులు
పశ్చిమగోదావరి ,భీమవరం టౌన్: నృత్య శిక్షకుడు (డ్యాన్స్ మాస్టర్) రూపంలో ఉన్న కీచకుడిని తలుచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భీమవరం టూటౌన్ జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ భారతి రెసిడెన్షియల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న బాలికపై డ్యాన్స్ మాస్టర్ సైదు చైతన్యవర్మ నృత్యం నేర్పే సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 12న కేసు నమోదు చేసి నిందితుడిని పో లీసులు అదుపులోకి తీసుకున్న సంగతి విధితమే. నిందితుడు ఈ పాఠశాలతో పాటు పలు ప్రైవేట్ స్కూళ్లలోనూ నృత్య శిక్షణ ఇస్తున్నట్టుగా తెలి సింది. కొల్లేటికోటకు చెందిన సైదు చైతన్యవర్మ భీమవరంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. డ్యాన్స్ సరిగా చేయడం లేదని ఇంకా బాగా నేర్పుతానని ఓ బాలికను స్కూల్లోని వాష్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
పెల్లుబికిన ఆగ్రహం
బాలిక కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పొరుగు మండలంలోని ఓ గ్రామానికి చెం దిన పలువురు బుధవారం భీమవరంలో శ్రీ భార తి స్కూల్ ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలను మూసివేయాలని, యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పెద్దెత్తున నినాదాలు చేశా రు. భీమవరం టూటౌన్, వన్‌టౌన్ సీఐలు ఎస్ ఎస్‌వీ నాగరాజు, పి.చంద్రశేఖరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించారు. కేసులో బాధిత కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని, ఎవరినీ విడిచి పెట్టే ప్రసక్తి లేదని సీఐ ఎస్‌ఎస్‌వీ నాగరాజు నచ్చచెప్పారు. 376 ఫోక్స్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.
డీఎస్పీని కలిసిన బాలిక కుటుంబ సభ్యులు
నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సీఐ ఎస్‌ఎస్‌వీ నాగరాజు వారితో మాట్లాడారు. డీఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళతామని వారంతా కోరారు. బాలిక కుటుంబ సభ్యులతో డీఎస్పీ మాట్లాడారు. విష యం తెలిసిందని నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు.
శ్రీభారతి స్కూల్‌కు షోకాజ్ నోటీసు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన అంశంలో భీమవరం శ్రీ భారతి స్కూల్‌ను ఎందుకు మూసివేయరాదో సంజాయిషీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆ పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్‌కు నోటీసులు జారీ చేశామని, వారిచ్చే సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment