లేడీస్‌ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత... | Police Arrested 3 Men In west Godavari | Sakshi
Sakshi News home page

లేడీస్‌ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...

Published Fri, Aug 2 2019 8:40 AM | Last Updated on Fri, Aug 2 2019 8:46 AM

Police Arrested 3 Men In west Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : పట్టణంలో మైనర్‌ బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన గోశాల ప్రసాద్‌ అనే యువకుడిని గురువారం అరెస్ట్‌ చేసినట్లు పట్టణ ఎస్సై కె.కేశవరావు తెలిపారు. యువతి తల్లి జూలై 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితుడిని కోర్టుకి హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. 

ఇద్దరు యువకులపై  కేసు..
ఏలూరు టౌన్‌: లేడీస్‌ హాస్టల్‌లోకి అక్రమంగా ప్రవేశించి కిటికీలోంచి వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు కట్టా సుబ్బారావుతోటలోని ఎంఆర్‌సీ వీధిలోని మనస్వి లేడీస్‌ హాస్టల్‌ వద్దకు రోజూ రాత్రివేళల్లో ఇద్దరు యువకులు గోడలు దూకి వస్తున్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ గోడదూకి ప్రాంగణంలోకి వచ్చి కిటికీలోనుంచి వీడియోలు, ఫొటోలు తీస్తుండగా హాస్టల్‌ నిర్వాహకురాలు పెనుగొండ రేణుకా దేవి చూసి కేకలు వేశారు.

ఒక యువకుడిని పట్టుకున్నారు. వారిద్దరూ ఏలూరు విద్యానగర్‌కు చెందిన ఏలూరి అనిల్‌ ఆశ, మరో యువకుడు చైతన్యగా గుర్తించారు. నిర్వహకురాలు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌ మూర్తి ఆదేశాల మేరకు ఎస్‌ఐ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement