Shraddha Das Emotional Post on Chaitanya Master Death - Sakshi
Sakshi News home page

వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్‌ మరణంపై శ్రద్ధాదాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Mon, May 1 2023 10:35 AM | Last Updated on Mon, May 1 2023 11:17 AM

Shraddha Das Emotional Post on Chaitanya Master Death - Sakshi

ఢీ షో కొరియోగ్రాఫర్‌ చైతన్య మాస్టర్‌ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధలు తాళలేకపోతున్నానంటూ ఉరేసుకుని చనిపోయారు. చైతన్య మాస్టర్‌ మరణంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో నటి శ్రద్దా దాస్‌.. మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనలైంది. 

'పుట్టుక, చావు ఎప్పుడు? ఎందుకు? జరుగుతాయో అంతుచిక్కవు. కానీ జననమరణానికి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్‌ చాలా మంచి వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ స్మైల్‌ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ మేరకు అతడితో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను షేర్‌ చేసింది.

చైతన్య మరణంపై శేఖర్‌ మాస్టర్‌ స్పందిస్తూ.. నీలాంటి టాలెంటెడ్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె ముక్కలయింది. చాలా డిస్టర్బ్‌ అయ్యాను. నీ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. యాంకర్‌ రష్మీ సైతం స్పందిస్తూ.. 'చావు అన్నింటికీ పరిష్కారం కాదు మాస్టర్‌. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

కాగా ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. 'అమ్మానాన్న, చెల్లి.. ఐ లవ్యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివ్వలేదు. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కానీ కుదురలేదు. అప్పులయ్యాయి. తీర్చగలను కానీ తీర్చలేకపోతున్నా. తట్టుకోలేకపోతున్నా. ఢీ పేరు ఇస్తుందని కానీ సంపాదన తక్కువ. జబర్దస్త్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ' అని వీడియోలో పేర్కొన్నారు. ఇది చూసిన చైతన్య అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.

చదవండి: మొన్ననే నాకు మాటిచ్చాడు, అంతలోనే ఇంత దారుణం: ఝాన్సీ

కొరియోగ్రాఫర్‌ చైతన్య ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement