కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధ భరించలేకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే తనకు తెలిసినంతవరకు చైతన్యకు ఎలాంటి అప్పులు లేవని ఆయన మేనమామ అంటున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చైతన్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అలాగని తనకు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని కూడా నేను అనుకోవడం లేదు. తనకు లక్షల కొద్ది అవసరం ఏముంటుందని? అయినా అంత అప్పు ఎవరిస్తారు?
మహా అయితే ఏదో పది, పదిహేను వేలు అప్పు చేసి ఉంటాడంతే! ఇంకేదో జరిగింది. చైతన్య చెల్లి పెళ్లి కూడా మేమే చేశాం. తను రూపాయి ఇవ్వలేదు. అతడు చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నాడు. తన ఆదాయంపై కుటుంబం ఏనాడూ ఆధారపడలేదు. తను సంపాదించిందేమీ ఇంటికి పంపించేవాడు కాదు. పైగా తనకు అవసరమైనప్పుడల్లా వీళ్లే చైతూకు తిరిగిచ్చేవాళ్లు. తనకు ఊర్లో 30 ఎకరాల భూమి ఉంది. అప్పులు కాకుండా మరింకేదైనా కారణం ఉండొచ్చు' అని అనుమానం వ్యక్తం చేశాడు ఆయన మేనమామ.
కాగా చైతన్య మరణంపై పలువురు డ్యాన్సర్లు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైతన్య మాస్టర్ ఓ ఈవెంట్ ఒప్పుకున్నాడని, తీరా సమయానికి కొందరు డ్యాన్సర్లు ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో మేనేజ్‌మెంట్ టీమ్ పేమెంట్ ఇవ్వకుండా ఆపేసిందని డ్యాన్సర్, కండక్టర్ ఝాన్సీ పేర్కొంది. ఈవెంట్‌కు వచ్చిన మిగతా డ్యాన్సర్లకు డబ్బులు ఇచ్చేందుకు మాస్టర్ వేరే వాళ్ల దగ్గర అప్పు చేశాడని, బహుశా ఆ ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆమె అభిప్రాయపడింది.
చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య, గుండె బద్ధలైందన్న శేఖర్ మాస్టర్
రూ.7 లక్షలు రావాల్సి ఉంది.. పేమెంట్ ఇవ్వలేదు: కండక్టర్ ఝాన్సీ
Comments
Please login to add a commentAdd a comment