
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మెగా అభిమాని. పలు పవన్ సినిమాలకు కోరియోగ్రాఫి అందించిన మాస్టర్.. ఆయన హీరోగా ఓ సినిమా తీయాలనేది ఆయన చిరకాల కోరికంటూ పలు ఇంటర్య్వూలో చెబుతూ ఉండేవారు. అంతేకాదు ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ కథ కూడా రాస్తున్నట్లు చెప్పెవాడు. చెప్పినట్టుగానే జానీ మాస్టర్ కథ పూర్తి చేసి పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ కథ విన్న పవన్.. జానీ డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: నటుల మధ్య చిచ్చుపెట్టిన గ్రేటర్ పోరు)
ఇక పవన్ కల్యాణ్ తన కథకు ఒకే చెప్పడంతో జానీ మాస్టర్ రాంచరణ్‌ను కలిసి ఈ కథ వినిపించడంతో కొణిదెల ప్రొడక్షన్‌లో ఈ సినిమాను నిర్మించేందుకు చెర్రీ కూడా ఒకే చెప్పాడంట. అయితే చెర్రీ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌లో కేవలం తండ్రి భారీ చిత్రాలను మాత్రమే నిర్మించిన చెర్రీ ఇప్పడు బాబాయ్ సినిమాను కూడా నిర్మించడానికి జానీతో జతకట్టినట్టు తెలుస్తోంది. దీంతో జానీ దర్శకత్వంలో బాబాయ్ హీరోగా చరణ్ ఈ సినిమా నిర్మించడం దాదాపు ఓకే అయినట్టు కూడా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.