johny
-
జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 50 రోజులు ముందుగానే పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.అయితే తాజాగా పుష్ప-2 నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. గతంలో ప్రకటించిన విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించారు. పుష్ప-2 డిసెంబర్ 5 వ తేదీనే థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు. దీంతో ఒక రోజు ముందుగానే పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ ప్రెస్‌మీట్‌కు హాజరైన నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.(ఇది చదవండి: కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్'కు బెయిల్)అందులో భాగంగానే జానీ మాస్టర్ గురించి ప్రశ్న ఎదురైంది. పుష్ప-2 ఓ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది.. ఆయనతోనే చేస్తున్నారా? లేదా వేరే వాళ్లను తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై నిర్మాత నవీన్ యేర్నేని క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్‌తో ఎలాంటి సాంగ్‌ను చేయడం లేదు.. ఇప్పటికే ఆ పాటను మరో కొరియోగ్రాఫర్‌తో పూర్తి చేశామని ఆయన తెలిపారు. దీంతో పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్‌ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పుష్ప మేకర్స్ నిర్ణయంతో జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలినట్లైంది. కాగా.. జానీమాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. -
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు!
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు నమోదైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఆయనపై కంప్లెంట్ చేశారు. జానీ మాస్టర్‌పై డ్యాన్సర్ సతీశ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన చేసిన అరాచకాలపై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొరియర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. షూటింగ్స్‌కు సతీష్‌ను పిలవవద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్లు చేయిస్తున్నాడని ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నానని వెల్లడించారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ సమస్యలపై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని కంప్లైంట్లో సతీశ్ వివరించారు. కాగా.. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతం జానీ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. -
నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్
టాలీవుడ్లో దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ పరిశ్రమ నుంచి ఆయనకు సోషల్ మీడియా ద్వార పలువురు సంతాపం ప్రకటించారు. గతంలో ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న విషయాలను అభిమానులు షేర్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ చనిపోయన తర్వాత ఏం జరుగుతుందో ఓ ఇంటర్వ్యూలో ముందే ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్ మాస్టర్) 'నా మరణం తర్వాత శేఖర్, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారు. కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వారికి ఏడుపు రాకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచిమాటలు చెబుతూ.. ఎప్పుడెప్పుడూ డెడ్‌బాడీని తీసేస్తారా..? అక్కడి నుంచి వెళ్లిపోదామా? అని' ఉంటారని చెప్పుకొచ్చాడు. జానీ మాస్టర్‌కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు.. దీంతో జెండూ బామ్‌ను పూసుకొని మ్యానేజ్ చేస్తాడని తెలిపాడు. ఇలా తన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వాళ్లందరూ చాలా రిలాక్స్ అవుతారని గతంలో తెలిపాడు. మెడికల్ కాలేజీకి మృతదేహం తన మరణం తర్వాత డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చెందాలని, అందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపాడు. కాబట్టి తన శిష్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు. తన అంత్యక్రియలకు వారెవరూ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. చివరకు తన కుమారుడు కూడా చితికి నిప్పు పెట్టాల్సిన పని లేదన్నాడు. తన అస్తికలు తీసుకొని గంగానదిలో కలపాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అలాంటి వాటిపై నమ్మకం లేదు.. అందుకే మరణానంతరం తన డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చేరాలని నిర్ణయించుకున్నానన్నాడు. దీంతో కొంతమంది మెడికల్ విద్యార్థులకు శవ పంచనామాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇలా అందరూ శరీర దానం చేయడం వల్ల మెడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) -
జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ సినిమా!
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మెగా అభిమాని. పలు పవన్ సినిమాలకు కోరియోగ్రాఫి అందించిన మాస్టర్.. ఆయన హీరోగా ఓ సినిమా తీయాలనేది ఆయన చిరకాల కోరికంటూ పలు ఇంటర్య్వూలో చెబుతూ ఉండేవారు. అంతేకాదు ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ కథ కూడా రాస్తున్నట్లు చెప్పెవాడు. చెప్పినట్టుగానే జానీ మాస్టర్ కథ పూర్తి చేసి పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ కథ విన్న పవన్.. జానీ డైరెక్షన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: నటుల మధ్య చిచ్చుపెట్టిన గ్రేటర్ పోరు) ఇక పవన్ కల్యాణ్ తన కథకు ఒకే చెప్పడంతో జానీ మాస్టర్ రాంచరణ్‌ను కలిసి ఈ కథ వినిపించడంతో కొణిదెల ప్రొడక్షన్లో ఈ సినిమాను నిర్మించేందుకు చెర్రీ కూడా ఒకే చెప్పాడంట. అయితే చెర్రీ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్లో కేవలం తండ్రి భారీ చిత్రాలను మాత్రమే నిర్మించిన చెర్రీ ఇప్పడు బాబాయ్ సినిమాను కూడా నిర్మించడానికి జానీతో జతకట్టినట్టు తెలుస్తోంది. దీంతో జానీ దర్శకత్వంలో బాబాయ్ హీరోగా చరణ్ ఈ సినిమా నిర్మించడం దాదాపు ఓకే అయినట్టు కూడా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. -
సూపర్‌స్టార్ టైటిల్‌తో ప్రశాంత్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం టైటిల్‌తో చాలా ఫ్రెష్‌గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్ స్టార్ ప్రశాంత్. గతంలో రజనీకాంత్ నటించిన చిత్రం జానీ విజయాన్ని సాధించింది. అదే టైటిల్‌తో ప్రశాంత్ నటిస్తున్న చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. స్టార్ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. నటి సంచితాశెట్టి కథానాయకిగా నటిస్తున్న ఇందులో ప్రముఖ నటుడు ప్రభు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఆనంద్‌రాజ్, అషుతోష్రాణా, శాయాజీ షిండే, దేవదర్శిని, కళైరాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వెట్ట్రిసెల్వన్ పరిచయం అవుతున్నారు. షూటింగ్ పార్టు పూర్తి చేసుకున్న జానీ చిత్ర వివరాలను తెలియజేయడానికి సోమవారం చిత్ర యూనిట్ స్థానిక సేట్పేట్లోని మలయాళీ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో ప్రశాంత్ మాట్లాడుతూ జానీ చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు. రజనీకాంత్ చిత్రంతో కంపేర్ చేస్తారు: నిర్మాత త్యాగరాజన్ మాట్లాడుతూ జానీ చిత్రం హర్రర్‌తో కూడిన భారీ సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రభు పాత్ర జానీ చిత్రంలో శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ జానీ చిత్రంతో పోల్చుకుంటారని, అంత స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అదరహో అనే స్థాయిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబరులో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
'నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు'
-
'నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు'
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఒకటో వార్డు కౌన్సిలర్ జానీ స్పష్టం చేశారు. శుక్రవారం సాక్షి మీడియాతో జానీ ఫోన్లో మాట్లాడారు. తాను అనారోగ్యంగా ఉన్నానని... అందువల్లే వైద్య చికిత్స కోసం జమ్మలమడుగు వదిలి వెళ్లానని తెలిపారు. తనను కిడ్నాప్ చేశారంటూ వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెట్టడం తీవ్ర వేదనకు గురి చేసిందని జానీ వెల్లడించారు. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో తనను ఇంత వరకు ఏ అధికారి సంప్రదించలేదన్నారు. అధికారులు తనను సంప్రదించి ఉంటే కిడ్నాప్ జరగలేదని సదరు అధికారులకు వెల్లడించేవాడినని చెప్పారు. తన కుటుంబ సభ్యులను సంప్రదించిన కనీసం తాను కిడ్నాప్ కాలేదని చెప్పేవారని జానీ వివరించారు. అయితే తాను ప్రస్తుతం ఎక్కడ ఉన్నది చెప్పేందుకు జానీ నిరాకరించారు.