జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్! | Pushpa 2 The Rule Movie Makers Gives Clarity On Johny Master Choreography For This Film In Press Meet | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పుష్ప-2 మేకర్స్!

Published Thu, Oct 24 2024 4:23 PM | Last Updated on Thu, Oct 24 2024 4:57 PM

Pushpa 2 Makers Clarity On Johny Master Choregraphy For This Film

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే 50 రోజులు ముందుగానే పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుందని ఇ‍ప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అయితే తాజాగా పుష్ప-2 నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. గతంలో ప్రకటించిన విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించారు. పుష్ప-2 డిసెంబర్ 5 వ తేదీనే థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు. దీంతో ఒక రోజు ముందుగానే పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ ప్రెస్‌మీట్‌కు హాజరైన నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

(ఇది చదవండి: కొరియోగ్రాఫర్‌ 'జానీ మాస్టర్‌'కు బెయిల్‌)

అందులో భాగంగానే జానీ మాస్టర్‌ గురించి ప్రశ్న ఎదురైంది. పుష్ప-2 ఓ సాంగ్‌కు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది.. ఆయనతోనే చేస్తున్నారా? లేదా వేరే వాళ్లను తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై నిర్మాత నవీన్ యేర్నేని క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్‌తో ఎలాంటి సాంగ్‌ను చేయడం లేదు.. ఇప్పటికే ఆ పాటను మరో కొరియోగ్రాఫర్‌తో పూర్తి చేశామని ఆయన తెలిపారు. దీంతో పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్‌ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది. 

ఏదేమైనా పుష్ప మేకర్స్ నిర్ణయంతో జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలినట్లైంది. కాగా.. జానీమాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇవాళ ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement