Attack On Rakesh Master House: నాపై దాడి చేశారంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు - Sakshi
Sakshi News home page

నాపై దాడికి యత్నించారు: రాకేష్‌ మాస్టర్‌  

May 4 2021 7:06 AM | Updated on May 4 2021 10:04 PM

Rakesh Master Complaint To Police Over Attackers In Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేయడానికి యత్నించడమే కాకుండా ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారంటూ సినీ నృత్యకారుడు ఎస్‌.రామారావు అలియాస్‌ రాకేష్‌ మాస్టర్‌ (50) బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణానగర్‌ ‘ఏ’ బ్లాక్‌లోని దేవేందర్‌ గౌడ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న తన ఇంట్లోకి సాయంత్రం సాయి యాదవ్, ఇమ్రాన్‌తో పాటు మరికొందరు అక్రమంగా ప్రవేశించి తనను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ కిటికీలు ధ్వంసం చేస్తూ చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తొమ్మిది నెలల క్రితం  ఓ యూట్యూబ్‌ చానల్‌కు తాను ఇంటర్వ్యూ ఇచ్చానని ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాయి యాదవ్, ఇమ్రాన్‌తో పాటు తనపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: ‘దీదీ ఓ దీదీ సినిమా..’ ఆర్జీవీ వైరల్‌ వీడియో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement