
శేఖర్ మాస్టర్ స్టెప్పులకు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. స్టెప్పులతో వెండితెరపై, పంచ్‌లతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతాడు. ఈమధ్యే శేఖర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే తొందరగానే కరోనాను జయించి ప్లాస్మాదానం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. (బలవంతంగా ఒప్పించారు: రియా)
ఇందులో శేఖర్ మాట్లాడుతూ.. "ఇప్పుడే ప్లాస్మా ఇచ్చాను. నెల కిత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. కిమ్స్‌లో చికిత్స తీసుకున్నా. ఇప్పుడు నా వంతు సాయంగా ప్లాస్మా ఇచ్చాను. సంతోషంగా ఉంది. కరోనా నుంచి రివకరీ అయిన వారు కూడా ప్లాస్మాదానం చేయండి, ప్రాణాలు నిలబెట్టండి" అని కోరాడు. కాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేశారంటూ మాస్టర్‌ను కొనియాడుతున్నారు. (శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు: సంజన అరెస్టు!)
Comments
Please login to add a commentAdd a comment