Jani
-
యువతిపై 'జానీ మాస్టర్' లైంగిక దాడి నిజమే.. రిమాండ్ రిపోర్టు ఇదే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్‌ను విధించింది. దీంతో ఆయన్ను చంచల్గూడా జైలుకు తరలించారు. అయితే, రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై దురుద్దేశంతోనే తన వద్ద అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది. (ఇదీ చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)ఈ క్రమంలో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు.' రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ తర్వాత జానీకి శిక్ష తప్పదని తెలుస్తోంది. -
హీరోగా మారిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్ విట్టల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ మరో హీరోగా, శ్రష్టి వర్మ నాయికగా నటిస్తున్నారు. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభ మైంది. ముహూర్తపు సన్నివేశానికి సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బాగుంటుందని ‘యథా రాజా తథా ప్రజా’లో నటిస్తున్నాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు జానీ. ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: సునోజ్ వేలాయుధన్. Thank you for gracing the Pooja Ceremony of my new film #YathaRajaTathaPraja 🙏🏼@ImSharwanand garu, #AayushSharma ji & #JKarunaKumar garu 😇@imVdeshK @verma_shrasti #SrinivasVittala #HareshPatel #OmMovieCreations #SriKrishnaMovieCreations @PulagamOfficial pic.twitter.com/ggVBogGXSL — Jani Master (@AlwaysJani) August 22, 2022 -
ఆనాడు 500 మందిలో ఒకడు, ఇప్పుడు ఫేవరెట్ హీరోకే..
Jani Master: అవకాశాలు వెతుక్కుంటూ రావు, మనమే వాటిని అందుకుంటూ పోవాలి. వచ్చిన ఏ చిన్న అవకాశమైనా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయానికి బాటలు వేసుకోవాల్సిందే. దీనివల్ల సక్సెస్ రావడానికి, ఫేమ్ తెచ్చుకోవడానికి కాస్త టైం పడుతుందేమో కానీ ఫలితం మాత్రం దక్కకుండా పోదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇదే సూత్రాన్ని నమ్మి పైకొచ్చారు చాలామంది. అందులో ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ ఒకరు. స్టేజ్ పర్ఫామర్‌గా కెరీర్ మొదలు పెట్టి గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా పని చేసి చివరకు డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కొరియోగ్రఫీ అందిస్తున్న అతడు ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే హీరోగా మారినా తన ప్యాషన్‌ను పక్కన పడేయలేదు. తాజాగా అతడు రామ్‌చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న మెగా మూవీకి కొరియోగ్రాఫర్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. "శంకర్ డైరెక్ట్ చేసిన ప్రేమికుడు చిత్రంలోని ముకాబులా పాటకు స్టేజ్ పర్ఫామర్‌గా మొదలైంది నా ప్రయాణం. తర్వాత బాయ్స్ సినిమాలో 500 మంది బ్యాకప్ డ్యాన్సర్లలో ఒకరిగా పని చేశాను. ఇప్పుడు ఏకంగా శంకర్ సినిమాలో అది కూడా నా ఫేవరెట్ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రంలో కొరియోగ్రాఫర్‌గా పని చేసే అవకాశం వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు రామ్‌చరణ్‌కు, నిర్మాత దిల్ రాజుకు సర్వదా కృతజ్ఞుడిని" అని జానీ మాస్టర్ ట్వీట్ చేశాడు. Being a stage performer to #Muqabula song to Backup dancer among 500+ people in #Boys, I've admired @shankarshanmugh Sir alot. Now, being the main choreographer to his film with my fvt. Hero, person #RamCharan Sir #RC15 feels unbelievable. Thank you for believing in me Sir 😍 pic.twitter.com/W6uCWU8Kt8 — Jani Master (@AlwaysJani) July 17, 2021 -
హీరోగా మరో సినిమా చేస్తున్న జానీ మాస్టర్!
Jani Master: ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మురళీరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. తాజాగా హీరోగా ఇంకో ఆఫర్ అందుకున్నారు జానీ. ‘మంత్ర, మంగళ’ చిత్రాల ఫేమ్ ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘దక్షిణ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నేడు (జులై 2) జానీ మాస్టర్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు తులసీరామ్. -
హీరోగా మారిన జానీ మాస్టర్
డాన్స్ మాస్టర్ స్థాయి నుంచి హీరోలుగా, దర్శకులుగా ఎదిగారు ప్రభుదేవా, లారెన్స్. తాజాగా డ్యాన్స్ మాస్టర్ జానీ హీరోగా మారారు. సుజి విజువల్స్ పతాకంపై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో కె.వెంకటరమణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయ్యింది. తొలి సీన్‌కి నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చి, గౌరవ దర్శకత్వం వహించారు. జానీ మాట్లాడుతూ – ‘‘నాకు కొరియోగ్రఫీ, డైరెక్షన్ అంటే ఇష్టం. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్నాక నటించాలని నిర్ణయించుకున్నాను. ‘నువ్వు హీరోగా చేయకపోతే నేనీ సినిమా తీయను’ అని నిర్మాత చెప్పటంతో మరింత కనెక్ట్ అయ్యాను’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు వెంకటరమణ. ‘‘ఈ చిత్రకథ అద్భుతంగా ఉంది’’ అన్నారు కథానాయిక దిగంగనా సూర్యవంశీ. -
బిగ్‌బాస్ 4: ప్రారంభమయ్యేది అప్పుడేనా..
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు నాల్గవ సీజన్ గురించి గందరగోళం నెలకొంది. అసలు ఈ ఏడాది బిగ్‌బాస్ ఉంటుందో ఉండదో అన్న సందిగ్ధంలో ఉన్న సమయంలోనే స్టార్ మా యాజమాన్యం ప్రోమోలు వదిలి ఇంటిల్లిపాదిని అలరించేందుకు బిగ్‌బాస్ సిద్ధమవుతోందని స్పష్టం చేసింది. అయితే ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేసుకోవడం, వారికి కరోనా పరీక్షలు జరిపి 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచడం వంటివి షోను ఆలస్యం చేస్తున్నాయి. ఎట్టకేలకు 16 మందిని ప్రాథమికంగా ఎంపిక చేసిన బిగ్‌బాస్ యాజమాన్యం వారికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అనంతరం వీళ్లందరినీ క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత మరోసారి కోవిడ్ పరీక్షలు జరిపి బిగ్‌బాస్ హౌస్‌కు పంపించి షో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మరోసారి మన్మథుడు నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈసారి విభిన్నంగా మూడు గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ రూమర్లను ఖండించిన జానీ మాస్టర్ కంటెస్టెంట్ల లిస్టులో ఆది నుంచీ ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే తాము బిగ్‌బాస్ గూటికి వెళ్లట్లేదంటూ హీరోయిన్లు శ్రద్ధాదాస్, పూనమ్ కౌర్, హీరో తరుణ్, నటి సునయన, జానీ మాస్టర్ తేల్చి చెప్పారు. గాయని మంగ్లీ,, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, సింగర్, నటుడు నోయల్, కరాటే కళ్యాణి, టిక్‌టాక్ స్టార్లను ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆరియానా, యూట్యూబర్ మెహబూబ్ దిల్సే, జోర్దార్ సుజాత, మై విలేజ్ షో స్టార్ గంగవ్వ పాల్గొననున్నారని సమాచారం. (బిగ్‌బాస్ 4: ఆమెకు ఎపిసోడ్‌కు లక్ష?) కంటెస్టెంట్ల లిస్టులో మార్పులు చేర్పులు రెండో సీజన్లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి భర్త నందు ఈసారి షోలో ఎంట్రీ అవ్వనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అలాగే కొరియోగ్రాఫర్ రఘు- ప్రణవి జంటను కూడా తీసుకురానున్నాన్నరన్న వార్త వైరల్ అవుతోంది. కానీ వీరికి చిన్న పాప ఉండటంతో బహుశా అది కుదరకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరో సీరియల్ నటుడిని, ఓ యాంకర్‌ను కూడా తీసుకున్నారు. ఆ యాంకర్ దేవీ నాగవల్లి అని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ లిస్టులో వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి చివర్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ షో ఆగస్టు 30న ప్రసారమవనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూద్దాం.. (బిగ్‌బాస్ 4: కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే!) -
బిగ్‌బాస్ 4: ఆ డ్యాన్సర్, సింగర్ కూడా!
లవ్ సాంగ్స్‌తో పాటు ఐటమ్ పాటలకు కూడా అదిరిపోయే స్టెప్పులుండాలంటే జానీ మాస్టర్ ఉండాల్సిందే. ఆయన కొరియోగ్రఫీ చేసే ఏ పాటైనా హిట్ అందుకోవాల్సిందే. ఆ రేంజ్లో అతనికి గుర్తింపు, మార్కెట్ ఏకకాలంలో లభించాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 4 తెలుగు సీజన్లో నృత్య దర్శకుడు జానీ మాస్టర్ పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే 'ఢీ' షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా "బాపు బొమ్మకి పెళ్లంట" అనే ప్రత్యేక కార్యక్రమంలోనూ పాల్గొని సందడి చేశారు. మరి ఆయన బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెడితే ఏమేరకు సందడి ఉంటుందో చెప్పనక్కర్లేదు. జానీ మాస్టర్‌తో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌కు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకునే అవకాశాలున్నాయి. (బిగ్‌బాస్-4 ఎంట్రీపై తరుణ్ క్లారిటీ) కాగా గత సీజన్లో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన డ్యాన్స్ కన్నా ఎక్కువగా కామెడీని పండిస్తూ ప్రేక్షకుకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ క్రమంలో ఈసారి కూడా కొరియోగ్రాఫర్‌ను తీసుకు వస్తే షోకు అదనపు హంగు వస్తుందన్న ఆలోచనలో ఉంది బిగ్‌బాస్ టీం. అలాగే గత సీజన్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ క్లోజ్ ఫ్రెండ్, సింగర్ నోయల్‌ను కూడా షోలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో అన్ని రంగాల నుంచి ఒక్కొక్కరిని తీసునేందుకు ఇదివరకే ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్న బిగ్‌బాస్ యాజమాన్యం అధికారిక కంటెస్టెంట్ల లిస్టును వెల్లడించేవరకు వేచి చూడాల్సిందే. (బిగ్‌బాస్: ఒక్క వారానికి రూ.16 కోట్లు?) -
కేడీ యాక్షన్
‘శంభో శంకర’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు హాస్యనటుడు ‘షకలక’ శంకర్. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కేడీ నెం1’. జానీ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘తుపాకి, ఉరిమి, పులి’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన డి. గిరీష్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన నిర్మాత కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘గిరీష్‌బాబు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. నేను నిర్మించిన సినిమాలకు వర్క్ చేసిన జానీ దర్శకత్వం చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ బాగుంది. సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘యాక్షన్ చిత్రమిది. ఇంకా 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్. అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ సినిమాలో జానీ నన్ను కొత్తగా చూపిస్తున్నారు. తన దగ్గర్నుంచి చాలా నేర్చుకుంటున్నాను’’అన్నారు శంకర్. ‘‘కామెడీ మాత్రమే కాదు యాక్షన్ కూడా చేయగలడని శంకర్ ఈ సినిమా ద్వారా నిరూపిస్తారు’’ అన్నారు జానీ. -
సినీ దర్శకుడు వీరు పోట్లపై కేసు నమోదు!
మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు వీరు పోట్లపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మైక్ టెస్టింగ్ 123 సినిమా హక్కుల్ని ఇస్తానని వీరు మోసం చేసినట్లు జానీ ఫిర్యాదులో తెలిపారు. నిర్మాత జానీ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.