సైకో థ్రిల్లర్‌ | DAKSHINA Telugu Movie Motion Poster Release | Sakshi
Sakshi News home page

సైకో థ్రిల్లర్‌

Published Mon, Nov 21 2022 4:32 AM | Last Updated on Mon, Nov 21 2022 4:32 AM

DAKSHINA Telugu Movie Motion Poster Release - Sakshi

సాయిధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘దక్షిణ’.  ఓషో తులసీరామ్‌ దర్శకత్వంలో కల్ట్‌ కాన్సెప్ట్స్‌ పతాకంపై అశోక్‌ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం (నవంబరు 20) సాయిధన్సిక బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. ‘‘సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది.

సాయి ధన్సిక హై ఓల్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ 70 శాతం పూర్తయింది. డిసెంబరులో విశాఖలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది’’ అన్నారు అశోక్‌ షిండే. బెంగాలీ హీరో రిషవ్‌ బసు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: బాలాజీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement