ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేస్తున్నారు. ముఖ్యంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సాధారణ సినిమాలతో పోలిస్తే.. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. తెలుగులో ఇటీవల రిలీజైన దూత, ది విలేజ్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లకు మంచి స్పందన వచ్చింది.
అయితే ఇటీవలే ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్' ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా టాప్-3లో నిలిచింది.
టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ, షారుక్ ఖాన్ జవాన్‌ను, ఆక్వామన్ చిత్రాలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 30 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment