అన్ని అంశాలతో.. | 'The Bells' shooting completed except for patchwork | Sakshi
Sakshi News home page

అన్ని అంశాలతో..

Published Sat, Feb 7 2015 11:49 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

అన్ని అంశాలతో.. - Sakshi

అన్ని అంశాలతో..

 సందేశంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న చిత్రం ‘ది బెల్స్’. జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ నెల్లుట్ల దర్శకుడు. ‘ఆడపిల్లనమ్మా నేను ’ అనే  ప్రైవేట్ సాంగ్‌తో సుపరిచితురాలైన మధుప్రియ పై పాట చిత్రీకరణతో ఈ చిత్రం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అనుకున్న విధంగా ఈ చిత్రం వచ్చిందంటే  దానికి కారణం మా నిర్మాతే. అలాగే  అతిథి పాత్రలో నటించిన తెలంగాణా భారీ నీటిపారుదల సలహాదారులు విద్యాసాగర్‌రావు గారికి నా కృతజ్ఞతలు. త్వరలో పాటలు విడుదల చేసి, మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యామ్, పాటలు: వరికుప్పల యాదగిరి, కాకర్లశ్యామ్, గోరటి వెంకన్న కెమెరా: ఉదయ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement