సాక్షి, విశాఖపట్నం: నూతన్ నాయుడు భార్య మధుప్రియను విశాఖ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మధుప్రియతో పాటు బాధితుడు శ్రీకాంత్‌ను తీవ్రంగా హింసించిన ఇందిరాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నూతన్ నాయుడు ఇంటి సూపర్వైజర్ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నూతన్ నాయుడు ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా.. శాస్త్రీయమైన సాక్ష్యాలు సేకరించే క్రమంలో ముగ్గురు నిందితులను రెండు రోజుల పాటు విశాఖ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు)
Comments
Please login to add a commentAdd a comment