
సాక్షి, విశాఖపట్నం: పోలీసుల విచారణలో నూతన్‌నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని నూతన్‌నాయుడు చేసిన మోసాలపై పోలీసులు ఆరా తీశారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తామని రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు స్వాహా చేసినట్టు పోలీసులు విచారణలో తెలిసింది. దాంతోపాటు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఇక పోలీసులు కస్టడీలోకి తీసుకునే ముందు.. నూతన్ నాయుడును అతని నివాసంలోనే పోలీసులు విచారించారు. ఈక్రమంలో అతను డ్రామాకు తెరతీశాడు. తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ నాటకమాడాడు. అయితే, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విశాఖ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్‌నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే.
(చదవండి: మధుప్రియను కస్టడీకి తీసుకున్న పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment