బెంగళూరులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య గొడవ హత్యకు దారితీసింది.
బెంగళూరులో ఇంటర్ విద్యార్థుల ఘాతుకం
యలహంక (కర్ణాటక): బెంగళూరులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. యలహంకలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. యలహంకలో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలు ఒకే ఆవరణలో ఉన్నాయి.
టెన్త్ విద్యార్థి హర్షరాజ్ (15), అతని ఇద్దరు మిత్రుల్ని ఇంటర్ (పీయూసీ) విద్యార్థి స్వస్తిక్, అతని బృందం మాట్లాడాలంటూ.. దగ్గర్లోని బార్ సందు లోకి తీసుకెళ్లారు. అక్కడ వారి మధ్య గొడవ చెలరేగడంతో ఇంటర్ విద్యార్థులు హర్షరాజ్ గుండెల్లో కత్తితో పొడిచారు. దీంతో విద్యార్థి అక్క డే ప్రాణాలొదిలాడు. మరో ఇద్దరు విద్యా ర్థులకు కూడా కత్తి గా యాలయ్యాయి. దీన్ని కొందరు స్థానికులు గమనించి ఇంటర్ విద్యార్థుల పైకి రాళ్లు విసరడంతో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకు ని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పలువురు చెబుతున్నారు.