
సాక్షి, హైదరాబాద్: విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో మాదిరి పిల్లలను స్కూల్‌కే పంపని పరిస్థితులు లేకున్నా... కొద్దిపాటి చదువుతోనే బడి మాన్పించే స్థితిగతులు మాత్రం తెలంగాణలోకనిపిస్తున్నాయి. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక సంగ్రహణ (తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ట్స్ అబ్‌స్ట్రాక్ట్) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సా హం.. అన్ని వర్గాల్లో పెరిగిన అవగాహన, బడుల సంఖ్య పెరగడం వల్ల 6–10 వయసు పిల్లలను ప్రతి ఒక్కరూ పాఠశాలకు పంపుతున్నారు. ఆఖరుకు జనాభా లెక్కల్లో లేని వారు (వలసదారులు, సంచార తెగలు) కూడా ప్రాథమిక బడుల్లో చేరుస్తున్నారు. రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 27,78,000 మంది 6–10 వయసు్కలుంటే, 1–5 తరగతుల్లో చేరే విద్యార్థులు 31,10,154 మంది ఉన్నారు.
కానీ 9, 10 తరగతులకొచ్చే సరికి కేవలం 10,92,039 మందే ఉంటున్నారు. ఇంటర్‌లో విద్యార్థుల సంఖ్య 4.32 లక్షలే ఉంటోంది. టెన్త్‌కొచ్చే సరికి డ్రాపౌట్స్ (స్కూల్ మానేసేవారు) 12.29 శాతం ఉంటోంది. జయశంకర్ జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్ (హైసూ్కల్ స్థాయిలో 29.49%) ఉంటున్నారు. చదువు మధ్యలో మానేసే వారు ఎక్కువగా మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment