ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష రాసి, ఆటోలో తిరిగి గ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
మెదక్ : ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష రాసి, ఆటోలో తిరిగి గ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చినకోడూరు మండలం మాల్యాల గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు పరీక్ష రాసి సోమవారం మధ్యాహ్నం ఆటోలో తిరిగి వెళ్తుండగా ఓ లారీ ఎదురుగా వస్తున్న బోలెరో వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో బోలెరో వాహనం పక్కనే ఉన్న ఆటోకు బలంగా తగలడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.