గాయపడ్డ విద్యార్థునిని ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యం
సాక్షి, దుబ్బాక : కొద్ది నిమిషాలైతే పరీక్ష హాలులో ఉండాల్సిన విద్యార్థినులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన చెల్లెళ్లను దుబ్బాకలోని పరీక్ష కేంద్రంలో దింపేందుకు స్కూటీపై తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోవడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లకు తీవ్రగాయాలైయ్యాయి. ఈ ఘటన దుబ్బాక మండలం బోప్పాపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత విద్యారి్థనులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోప్పాపూర్‌కు చెందిన నారాయణ కూతుళ్లు అర్చన, అనూష ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. అయితే శుక్రవారం తన చెల్లెళ్లను ఇద్దరినీ పెద్ద కూతురు హరిత స్కూటీపై దుబ్బాకలో పరీక్ష కేంద్రంలో దింపేందుకు వస్తుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థినులు అనూష,అర్చన
ఈ క్రమంలోనే బోప్పాపూర్ దాటాక మార్గ మధ్యలో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా స్కూటీ టైర్ పగలడంతో వారు కింద పడిపోయారు. దీంతో హరితతో పాటు అర్చన, అనూషలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యారి్థనులు ప్రమాదంలో గాయపడటంతో తోటి విద్యార్థులు చలించిపోయారు. గాయపడ్డ తమ స్నేహితులను చూసేందుకు పరీక్ష అయిపోగానే ఆస్పత్రికి వెళ్లారు. గాయపడ్డ విద్యార్థులను బీజేపీ నాయకులు రఘునందన్‌రావు పరామర్శించారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
పాపన్నపేట(మెదక్): ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకొని గాయాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట ఏఎస్‌ఐ నర్సింహులు సమాచారం మేరకు.. మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన లంగడి మల్లేశం(31) ఫిబ్రవరి 28న రాత్రి తనకు ఆటో ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులతో కొట్లాడి అదే రాత్రి కోపంతో వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అప్పట్లో అతడిని మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎఎస్‌ఐ నరసింహులు వెల్లడించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment