ఇంటర్మీడియెట్ విద్యార్థిని రమాదేవి
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా... కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులను అనుమతించలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో వాగ్దేవి కాలేజీ ఇంటర్ విద్యార్థినిని ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టగా పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. బాధిత విద్యార్థిని రమాదేవి మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన తాను రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు బయటకు పంపారని చెప్పింది. పరీక్ష రాసేందుకు అనుమతించాలని వేడుకున్నా సిబ్బంది తన మాట వినలేదని వాపోయింది.
కాగా, ఏపీలో మొత్తం 1,423 కేంద్రాల్లో, తెలంగాణలో 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే నిమిషం నిబంధన కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు చిక్కులు పెట్టి పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకున్న విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment