
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షల నేపథ్యంలో సెంటర్ల వద్ద సందడి నెలకొంది.
ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. ప్రతి విద్యార్థిని హాల్‌టికెట్స్‌తోపాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతిస్తున్నారు. 9 గంటలు సమయం దాటినా 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించినట్టు సమాచారం.

Comments
Please login to add a commentAdd a comment