ఇంటర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ  | Clash Between Inter Students In Khammam District | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ 

Published Sun, Dec 18 2022 1:31 AM | Last Updated on Sun, Dec 18 2022 8:05 AM

Clash Between Inter Students In Khammam District - Sakshi

విద్యార్థిపై దాడి దృశ్యం (సీసీ టీవీ ఫుటేజీ) 

ఖమ్మం సహకారనగర్‌/ఖమ్మం అర్బన్‌: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం విద్యార్థుల మధ్య స్వల్ప వివా దం చెలరేగగా.. శనివా రం సీనియర్‌ విద్యార్థిపై ఇద్దరు జూనియర్‌ విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆ విద్యార్థిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

కాగా, గాయపడిన విద్యార్థి ఓ కార్పొరేటర్‌ కుమారుడని సమాచారం. అయితే, కళాశాల ఆనుకుని ఉన్న ప్రధాన రహదారి వెంట విద్యార్థులు మాట్లాడుకుంటూనే ఒక్కసారిగా దాడికి దిగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ దాడి దృశ్యాలు కళాశాల గేట్‌ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈమేరకు ఖమ్మం అర్బన్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణను వివరణ కోరగా ఘటనపై విచారణ చేస్తున్నామని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement