
సాక్షి, విజయవాడ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్ధులకు బాసటగా నిలుస్తూ.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది.
కాగా, టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18 నుండి 30 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment