Free Bus Facility
-
‘ఎక్స్‌ప్రెస్’ బస్సుల్లో ఉచితం ఇవ్వాలా వద్దా!?
సాక్షి, అమరావతి : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేయాలా వద్దా అనే అంశంపై సందిగ్థతతో కొట్టుమిట్టాడుతోంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితంచేస్తే ఎలా ఉంటుంది?.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే ఎలా ఉంటుంది?.. అనే దానిపై తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశం గ్రహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ రెండు రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. అయినా.. ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఎన్నికల హామీని నీరుగార్చేదెలా.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తామనే టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచి్చంది. దీని ప్రకారం.. అన్ని కేటగిరీల బస్సుల్లో ఉచితంగా అమలుచేయాలి. కానీ, ఈ పథకాన్ని నీరుగార్చేందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యత్నిస్తోంది. అందుకే ఈ తరహా పథకాన్ని అమలుచేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పర్యటనల పేరుతో ఏడు నెలలుగా కాలయాపన చేసింది. ముందు అధికారుల బృందాలు పర్యటించి నివేదిక సమర్పించాయి. అయినాసరే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి మరోసారి పర్యటనలతో కాలం వెళ్లదీశారు. ఆగస్టు 15 నుంచి ఓసారి.. కాదు దసరా నుంచి అని మరోసారి చెప్పుకొచ్చారు.సంక్రాంతికి కూడా ఈ పథకాన్ని ప్రారంభించడంలేదని తాజాగా వెల్లడించి ఉగాదికి వాయిదా వేశారు. తీరా ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెండు రకాల ప్రతిపాదనలపై చర్చించడం గమనార్హం. కేవలం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే పరిమితంచేస్తే ఎంత భారంపడుతుంది.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అమలుచేస్తే ఎలా ఉంటుందని చర్చించారు.ఆ మూడు రాష్ట్రాలు నిధుల కేటాయింపు ఇలా.. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో సహా అన్ని కేటగిరీల సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేస్తున్నాయి. అందుకోసం ఏటా తమిళనాడు ప్రభుత్వం రూ.6,396 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.5,015 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.4,084 కోట్లు కేటాయిస్తున్నాయి. కానీ, ఆ స్థాయిలో నిధుల కేటాయింపుపై టీడీపీ కూటమి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. అందుకే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోంది.ఎక్స్‌ప్రెస్ బస్సులతో సహా అన్ని బస్సుల్లో పథకాన్ని అమలుచేయాలంటే.. » ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు: రూ.3,182 కోట్లు » నెలకు కేటాయించాల్సింది : రూ.265 కోట్లు » ఉచిత ప్రయాణానికి కేటాయించాల్సిన బస్సుల సంఖ్య : 8,193 » కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య : 2,045 » కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు : 11,479 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది)పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకే ఈ పథకాన్ని పరిమితం చేస్తే.. » ఏడాదికి ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు : రూ.2,122 కోట్లు » నెలకు కేటాయించాల్సింది : రూ.177 కోట్లు » ఉచిత ప్రయాణానికి కేటాయించాల్సిన బస్సుల సంఖ్య : 6,303 » కొత్తగా కొనాల్సిన బస్సుల సంఖ్య : 1,684 » కొత్తగా నియమించాల్సిన ఉద్యోగులు: 9,449 (డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది) -
ఉచిత బస్సును సమీక్షిస్తాం: శివకుమార్
బెంగళూరు: కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టాక శివకుమార్ మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ కన్నడనాట ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కిందటేడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగ్గా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,507 కోట్లను దీనిపై వెచ్చించింది. ‘‘ 5 నుంచి 10 శాతం మంది మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రవాణా మంత్రి రామలింగా రెడ్డితో దీనిపై చర్చిస్తాను’’ అని శివకుమార్ వివరించారు. -
ఫ్రీ బస్సు చిత్రాలు..
-
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్ధులకు బాసటగా నిలుస్తూ.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. కాగా, టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18 నుండి 30 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. -
హాట్సాఫ్ బామ్మ.. నువ్ చాలా గ్రేట్!
-
Viral Video: హాట్సాఫ్ బామ్మ.. నువ్ చాలా గ్రేట్!
చెన్నై: ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణమంటే ఎవరు కాదంటారు? ఎగిరి గంతేసి ఫ్రీగా చక్కర్లు కొడుతుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. టికెట్ కొనుక్కునే వెళ్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు ఈ వృద్ధురాలు. బస్సులో ఉచితంగా ప్రయాణించనని, తనకు టికెట్ ఇవ్వాలని కండక్టర్‌తో గొడవ పడుతున్న బామ్మ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికార డీఎంకే పార్టీ.. రాష్ట్రంలోని మహిళలు ప్రభుత్వ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. మధుకరాయ్ నుంచి పాలథురాయ్ వెళ్తున్న ఓ బస్సులో వృద్ధురాలు ఎక్కింది. బస్సులో పురుషుల వద్ద టికెట్లు తీసుకుంటున్నాడు కండక్టర్. తనకూ టికెట్ ఇవ్వాలని కండక్టర్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వబోయింది వృద్ధురాలు. ముందుగా అందుకు నిరాకరించిన కండక్టర్.. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వెళ్లొచ్చని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే.. తాను ఫ్రీగా వెళ్లాలనుకోవట్లేదని, టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక టికెట్‌కు సరిపడ రూ.15 తీసుకుని టికెట్ ఇచ్చాడు. ఇదీ చదవండి: చైనీయులకు 2 రోజుల్లో అమెరికా వీసా.. భారతీయులకు రెండేళ్లు! -
రాజమండ్రిలో స్నానానికి కాలినడకే!
ఘాట్ల సమీపానికి వాహనాలపై ఆంక్షలు 600 మీటర్ల దూరంలోనే నిలిపివేత భక్తుల కోసం 300 ఉచిత బస్సులు సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేయాలనుకునే వారికి అర కిలోమీటర్ నడక తప్పక పోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కొంతదూరం నడిస్తేగానీ పుష్కర ఘాట్లకు చేరుకోలేరు. రాజమండ్రిలో పుష్కర ఘాట్ల వద్దకు ఎలాంటి వాహనాలను అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఘాట్లకు 600 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తారు. రద్దీనిబట్టి దూరాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాలి నడక ద్వారానే భక్తులు ఘాట్ల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. నడవడానికి వీల్లేని స్థితిలో ఉన్న వృద్ధుల కోసం చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంచుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 262 పుష్కర ఘాట్లను నిర్మించారు. రాజమండ్రి పరిసరాల్లో 16 ఘాట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది పుష్కర స్నానమాచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 12 లక్షల మంది రాజమండ్రికే వస్తారని సమాచారం. ఘాట్ల వరకు ఉచిత బస్సులు వివిధ మార్గాల్లో రాజమండ్రికి చేరుకున్న భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు రావాలంటే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉచిత బస్సులు ఎక్కాల్సిందే. ప్రైవేట్ వాహనాలను పార్కింగ్ ప్రాంతాల వరకే అనుమతిస్తారు. పార్కింగ్ కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ నుంచి పుష్కర ఘాట్లకు 300 ఉచిత బస్సులు నిరంతరాయంగా తిరుగుతాయి. పుష్కర ఘాట్ల వద్ద వాహనాల రాకపోకల నిషేధిత ప్రాంతంలోకి ఉచిత బస్సులను సైతం అనుమతించరు. కొంత దూరంలోనే నిలిపేస్తారు. చిన్న ఘాట్లలో నీటి ఇబ్బందులు రాష్ట్రంలో 262 పుష్కర ఘాట్లు ఉండగా.. 130 ఘాట్లను ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా నిర్మించింది. గోదావరి పక్కనే ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తుల రద్దీ తక్కువగానే ఉండనుంది. అయినా అలాంటి ఘాట్లలో పుష్కర స్నానాలకు సరిపడా నీటిమట్టం ఉంటుందో లేదోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధవళే శ్వరం బ్యారేజీకి ఎగువన ఉన్న ఘాట్లలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, బ్యారేజీకి దిగువన ఉండే ఘాట్లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగించడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఆయా ఘాట్ల వద్ద నీటి నిల్వకు అవకాశం లేదు. పుష్కర ఘాట్లలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడితే షవర్ సిస్టమ్ ద్వారా భక్తులు స్నానాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఈ నెల 22న నగరంలోని స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఆ కళాశాల కరస్పాండెంట్ చావా ప్రతాప్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు నగరంలోని మయూరి సెంటర్, గాంధీచౌక్, రైల్వే స్టేషన్ , జడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, రోటరీ నగర్లో బస్సులు సిద్ధంగా ఉంటాయని వివరించారు. దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. విజయ కళాశాల ఆధ్వర్యంలో.. కొణిజర్ల: ఈ నెల 22 న జరిగే ఎంసెట్ (ఇంజనీరింగ్, మెడికల్) ప్రవేశ పరీక్షలకు తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయబోవు విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు విజయ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంసెట్ పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థుల కోసం పాలేరు, కల్లూరు, వైరా, వల్లభి, బోనకల్, తిరుమలాయపాలెం నుంచి ఉదయం 7:15 గంటలకు బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. ఖమ్మం నగరం నుంచి పరీక్షకు హాజయరయ్యే విద్యార్థుల కోసం పెవెలియన్ గ్రౌండ్, రైల్వేస్టేషన్, ఇల్లెందు క్రాస్ రోడ్ల నుంచి ఉదయం 7:45 నిమిషాలకు బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. విద్యార్థులను, వారి వెంట వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్ష్య కళాశాల ఆధ్వర్యంలో .. కొణిజర్ల..: తనికెళ్లలో గల లక్ష్య ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కళాశాల చైర్మన్ గుర్రం తిరుమలరావు, సెక్రటరీ, కరస్పాడెంట్ కొప్పురావూరి శ్రీనివాస్,ట్రెజరర్ బూరుగడ్డ కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రఘురామ్‌లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్టాండ్, రైల్వేస్టేషన్, గాంధీఛౌక్, ముస్తఫానగర్, బైపాస్‌రోడ్, ఖానాపురం , శ్రీనివాసనగర్, వైరాల నుంచి ప్రత్యేక బస్సులు ఉదయం 8:20 నిమిషాలకు బయలుదేరుతాయని తెలిపారు. ఆడమ్స్ కళాశాల ఆధ్వర్యంలో.. పాల్వంచ: ఖమ్మంలో ఈ నెల 22వ తేదీన జరిగే ఎంసెట్ 2014 పరీక్షకు హాజరయ్యే దూర ప్రాంత విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు స్థానిక ఆడమ్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ పరిటాల చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల నుంచి ఖమ్మంకు తరలివెళ్లే వారు ఉదయం 5 గంటలకు ఆయా ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్ 94400 05304,99661 96435లో సంప్రదించాలని కోరారు. అబ్దుల్ కలామ్ కళాశాల ఆధ్వర్యంలో.. కొత్తగూడెం రూరల్: ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కొత్తగూడెం మండల సుజాతనగర్ పంచాయతీ వేపలగడ్డ గ్రామంలోని అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ కార్తిక్, ప్రిన్సిపాల్ జనార్థన్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, పాల్వంచ, టేకులపల్లి, కొత్తగూడెం, గౌతంపూర్ ఏరియా నుంచి బయలు దేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.